చిలుక పచ్చ డ్రెస్‌లో పరువాలు చూపిస్తూ మతిపోగుడుతున్న శ్రీముఖి..

ప్రముఖ యాంకర్, సినీ నటి శ్రీముఖి 2012లో విడుదలైన జులాయి సినిమా నుంచి 2021లో రిలీజ్ అయిన మాస్ట్రో వరకు చాలా సినిమాల్లో నటించింది. మొన్నటిదాకా అనేక షోలకు హోస్ట్‌గా కూడా చేసింది. ఇప్పుడు కూడా ఏకంగా నాలుగు షోలకు హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. డ్యాన్స్ ఐకాన్, ఆదివారం విత్ స్టార్ మా పరివారం, సారంగదరియా వంటి ప్రోగ్రామ్స్‌కి యాంకరింగ్ చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ 2021లో మూడు సినిమాల్లో నటించింది. చిరంజీవి నటిస్తున్న అప్‌కమింగ్ మూవీ ‘భోళా శంకర్’లో కూడా ఈ తార మెరవనుంది.

శ్రీముఖి తన వాక్చాతుర్యం, అందంతో చాలామంది హృదయాలను దోచేసింది. ఈ ముద్దుగుమ్మకు యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్స్‌లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో 45 లక్షల వరకు ఈ తారకి ఫాలోవర్లు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. శ్రీముఖి ఫొటోషూట్స్ చేస్తూ వాటిని ఎప్పుడూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలోనే షేర్ చేసుకుంటుంది. బాగా తాజాగా ఒక చిలుక పచ్చ డ్రెస్సుతో చేసిన ఒక ఫొటోషూట్‌ను ఇన్‌స్టా షేర్ చేసింది.

 

 

View this post on Instagram

 

A post shared by Sreemukhi (@sreemukhi)

హూప్ ఇయర్‌రింగ్స్, గ్రీన్ కలర్ హై హీల్స్, ఐటమ్ గర్ల్ వేసినట్లు మోకాళ్ల పైకి డ్రెస్ ధరించింది. చూసేందుకు బెల్లీ డ్యాన్సర్ లేదా క్లబ్ డ్యాన్సర్ లాంటి సెక్సీ డ్రెస్ ఆమె ధరించింది. ఈ ముద్దుగుమ్మ ఇయర్‌రింగ్స్, ఎద భాగంలో కనిపించిన సిల్క్ కలర్ క్లాత్ ఆకర్షణీయంగా కనిపించాయి. మేకప్ మరీ ఎక్కువగా కాకుండా, మరీ తక్కువ కాకుండా ఒక రేంజ్ లో అప్లై చేసింది. దానివల్ల ఆమె అందం మరింత రెట్టింపు అయింది. కళ్ళకు కాటుక, కనురెప్పలపై డ్రెస్ తో మ్యాచ్ అయ్యేలా గ్రీన్ కలర్ మార్క్స్, రెడ్ కలర్ లిప్‌స్టిక్ ఆమె అందాన్ని పెంచేసాయి. డాన్స్ ఐకాన్ షో కోసం ఈ తార ఇలాంటి అల్ట్రా ఫ్యాషన్ డ్రెస్‌లో మెరిసినట్లు తెలుస్తోంది.