బైరెడ్డి సీటుపై ‘ఫ్యాన్స్’ హడావిడి..!

ఏపీ రాజకీయాల్లో బాగా క్రేజ్ యువ నాయకుల్లో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఒకరు. తక్కువ సమయంలోనే మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. వైసీపీ యువ శ్రేణుల్లో బైరెడ్డికి ఫాలోయింగ్ బాగా ఎక్కువ ఉంది. కొంతమంది సీనియర్లకు లేని ఫాలోయింగ్ బైరెడ్డికి తక్కువ సమయంలోనే రాష్ట్ర స్థాయిలో ఫేమస్ అయ్యారు. అలాగే జగన్ దృష్టిలో ఉన్న బైరెడ్డికి నామినేటెడ్ పదవి కూడా వచ్చింది. అయితే బైరెడ్డిని అభిమానించే వారు..ఆయనకు ఏదైనా సీటు ఇస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బైరెడ్డిని నెక్స్ట్ ఎన్నికల్లో నిలబెట్టాలని..యువ కార్యకర్తలు కోరుతున్నారు. అయితే బైరెడ్డికి అంత ఈజీగా సీటు దక్కడం అనేది కష్టం. ఎందుకంటే పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు..వారిని దాటుకుని బైరెడ్డికి సీటు దక్కడం జరిగే పని కాదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. బైరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న నందికొట్కూరు సీటు ఎస్సీ రిజర్వడ్. ఇక్కడ పోటీ చేయడం కుదరదు.

ఇక కర్నూలులో మిగిలిన సీట్లు అన్నీ ఫుల్‌గా ఉన్నాయి. ఒక్క సీటు కూడా ఖాళీగా లేదు. అటు ఎంపీ సీట్లు కూడా ఫుల్. అలాంటప్పుడు బైరెడ్డికి నెక్స్ట్ దక్కడం అనేది ఈజీ కాదు. అయితే బైరెడ్డి అభిమానులు మాత్రం..తమ నేతకు ఖచ్చితంగా సీటు దక్కుతుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎలాగో పనిచేయని కొందరు ఎమ్మెల్యేలకు జగన్ సీటు ఇవ్వనని చెప్పారని, కాబట్టి వాటిల్లో ఏదొక సీటు ఖాళీ అవుతుందని అంటున్నారు.

అలాగే బైరెడ్డికి ఎంపీ సీటు అయిన దక్కే ఛాన్స్ ఉంటుందని మాట్లాడుతున్నారు. అందులోనూ నంద్యాల ఎంపీ సీటు అని బైరెడ్డి అనుచరులు ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం నంద్యాల ఎంపీగా పోచ బ్రహ్మానందరెడ్డి ఉన్నారు. ఆయన వివాదరహితుడుగా ఉన్నారు. ఈయనపై నెగిటివ్ పెద్దగా లేదు. అలాంటప్పుడు బ్రహ్మానందరెడ్డిని మార్చే అవసరం వస్తుందా? అనేది డౌట్. మొత్తానికైతే బైరెడ్డికి సీటు దక్కుతుందో లేదో క్లారిటీ లేదు.