ఇది కదా అసలు ట్విస్ట్ అంటే.. కిక్ మూవీని తలపిస్తున్న జాన్వీ సిస్టర్స్ డేటింగ్..!

రవితేజ హీరోగా, ఇలియానా హీరోయిన్ గా నటించిన కిక్ సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇలియానా తాను ప్రేమించి రిజెక్ట్ చేసిన హీరోను తన సిస్టర్ లవ్ చేసి అసలు ట్విస్ట్ ఇస్తుంది. ప్రస్తుతం ఇదే ట్విస్ట్ జాన్వీ కి తన చెల్లెలు ఖుషి కపూర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అసలు విషయంలోకెళితే శ్రీదేవి లాగ జాన్వి కపూర్ అతిలోక సుందరి కాకపోయినా శ్రీదేవి డాటర్ గా బాలీవుడ్లోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఎప్పటికప్పుడు వరుస హాట్ గ్లామర్ ఫోటోషూట్లతో రెచ్చిపోయే ఈ ముద్దుగుమ్మ ఎక్కడ కూడా తగ్గడం లేదు.. అయితే ఇప్పుడు ఈమె చెల్లెలు ఖుషి కపూర్ కూడా తగ్గేదేలే అంటూ అక్క తరహాలోనే గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది.janhvi kapoor khushi kapoor pose for photoshoot boney kapoor comment 2 of  my 4 darling bachhas dvy | Janhvi Kapoor और खुशी ने एक- दूसरे पर लुटाया  जमकर प्यार, बोनी कपूर के

బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం అలాగే సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం జాన్వీ కపూర్ తరహాలో ఖుషీ కపూర్ గ్లామర్ షో చేస్తూ ఉండడం గమనార్హం . అయితే ఆమె ఎంత స్కిన్ షో చేసినా సరే తన అక్కలాగ ఆమెకు అవకాశాలు రావడం లేదు అని చెప్పాలి. ఇకపోతే జాన్వి కపూర్, ఖుషి కపూర్ ఇద్దరి లవ్ ఎఫైర్స్ గురించి గతంలో ఎన్నో రూమర్స్ వినిపించాయి. ఈ రూమర్స్ ను వీరిద్దరూ అంగీకరించలేదు.. అలాగని ఖండించలేదు కూడా.. కానీ తాజాగా జాన్వి కపూర్ ఒక ఇంటర్వ్యూలో తన గురించి వచ్చిన ఒక షాకింగ్ రూమర్ పై స్పందించింది.. జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. నేను నా చిన్ననాటి స్నేహితుడైన అక్షత్ రాజన్ తో డేటింగ్ చేశాను. మేమిద్దరం విడిపోయాక ఖుషీ కపూర్ అతడితో డేటింగ్ మొదలు పెట్టినట్లు రూమర్స్ వచ్చాయి. అయితే ఇది చదువుతున్నప్పుడు నాకే చాలా అసభ్యకరంగా, దారుణంగా అనిపించింది.Janhvi Kapoor gets kisses and hugs from rumoured ex Akshat Rajan, goofs  around with Khushi at party. See videos | Bollywood - Hindustan Times

ఇలా రూమర్స్ రావడానికి కూడా కారణం లేకపోలేదు.. ఖుషి అక్షత్ తో కొంచెం చనువుగా ఉండడం చూసి ప్రతి ఒక్కరూ ఇలా అనుకున్నారు. మా అక్క చెల్లెల మీద ఇకపై ఇలాంటి దారుణమైన రూమర్స్ సృష్టించవద్దు అని కూడా కోరింది జాన్వీ కపూర్.