అద్దంకి సీటు చైతన్యకే..గొట్టిపాటిని ఆపగలరా!

మొత్తానికి అద్దంకి సీటులో వైసీపీ అభ్యర్ధి ఎవరో తేలిపోయింది. వైసీపీ నుంచి బాచిన కృష్ణచైతన్య పోటీ చేయడం ఫిక్స్ అయింది. తాజాగా సీఎం జగన్..అద్దంకి వైసీపీ నేతలతో సమావేశమై..ప్రజలందరికీ మంచి చేశామని, అలాగే స్థానిక ఎన్నికల్లో అద్దంకిలో విజయం సాధించమని, అలాంటప్పుడు అద్దంకి అసెంబ్లీలో కూడా గెలుస్తామని, 175కి 175 సీట్లు సాధించగలమని జగన్ చెప్పుకొచ్చారు. అలాగే కృష్ణచైతన్య విజయనికి కృషి చేయాలని వైసీపీ నేతలకు సూచించారు.

అంటే అద్దంకి సీటు కృష్ణచైతన్యకు ఫిక్స్ చేసినట్లే. అయితే టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. ఆయనకు వ్యతిగతంగా ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. అందుకే ఏ పార్టీలో ఉన్నా సరే ఆయన సత్తా చాటుతున్నారు. నిత్యం ప్రజలతోనే ఉంటూ..వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారు. ఈ విషయంలో గొట్టిపాటికి ప్రజల్లో మంచి మార్కులే పడుతున్నాయి. ఇలా బలంగా ఉన్న గొట్టిపాటికి చెక్ పెట్టడమనేది కృష్ణచైతన్యకు చాలా కష్టమైన పని.

కాకపోతే అధికారంలో ఉండటం, ప్రజల్లో ఎక్కువ తిరగడం, గడప గడపకు కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా నిర్వహిస్తున్నారు. అలాగే స్థానిక ఎన్నికల్లో వైసీపీ మంచి విజయాలు సాధించడంలో బాగా కృషి చేశారు. దీని బట్టి చూస్తే కృష్ణచైతన్యకు పాజిటివ్ ఉంది. కానీ వైసీపీలో గ్రూపు తగాదాలు ఉన్నాయి. ఇక్కడ కరణం బలరామ్ వర్గం సెపరేట్‌గా ఉంది. ఆ వర్గం ఏ మేరకు బాచినకు సపోర్ట్ ఇస్తుందో చెప్పలేం.

పైగా ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తోంది..పథకాలు మాత్రం వస్తున్నాయి గాని, అభివృద్ధి తక్కువ, పన్నుల బాదుడు ఎక్కువ..పైగా గొట్టిపాటిని ఎన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారో చెప్పాల్సిన పని లేదు. దాని వల్ల గొట్టిపాటిపై ప్రజల్లో ఇంకా సానుభూతి పెరిగింది. ఇటీవల వచ్చిన సర్వేల్లో కూడా అద్దంకిలో మళ్ళీ గొట్టిపాటికే గెలుపు అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా తేలింది. ఇక ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది..మరి ఈలోపు అద్దంకిలో ఏమన్నా రాజకీయం మారుతుందేమో చూడాలి.