రిస్క్‌లో వైసీపీ..40 ఎమ్మెల్యేలు డౌటే..!

అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుందని, ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని..ఇక నెక్స్ట్ వైసీపీ గెలిచే అవకాశాలు లేవని చెప్పి ప్రతిపక్ష టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ మాత్రం తాము ప్రజలకు మంచి చేశామని..లోకల్ ఎన్నికల్లో కూడా దాదాపు క్లీన్ స్వీప్ చేశామని, కాబట్టి 175కి 175 సీట్లు గెలిచేస్తామని చెప్పి జగన్ అంటున్నారు.

అయితే అటు టీడీపీ చెప్పేది పూర్తిగా నిజం కాదు..ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత లేదు. అలాగే జగన్ చెప్పేది జరిగే అవకాశం ఏ మాత్రం లేదు..175 సీట్లు గెలవడం అసాధ్యం. కానీ వాస్తవ పరిస్తితులని చూసుకుంటే వైసీపీకి పూర్తి అనుకూల వాతావరణం లేదు..సీఎంగా జగన్‌కు కాస్త పాజిటివ్ ఉంది గాని..ఎమ్మెల్యేలకు మాత్రం పాజిటివ్ లేదని తాజాగా సీ ఓటర్ సంస్థ సర్వేలో తేలింది. ఏపీలో 56.9 శాతం మంది జగన్ పాలనపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిసింది.

సిటింగ్‌ ఎమ్మెల్యేలపై ఏపీలో 28.5% మేర వ్యతిరేకత తేలింది. అంటే 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 50 మంది పైనే ఎమ్మెల్యేలు వ్యతిరేకత ఎదురుకుంటున్నారని చెప్పొచ్చు. అయితే 175లో 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలే. పైగా టీడీపీ-జనసేన నుంచి ఐదుగురు వచ్చారు. అంటే 156 మంది వైసీపీకి ఉన్నారు. అంటే వ్యతిరేకత ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలు ఎక్కువ వైసీపీ వారే. ఎలా చూసుకున్న 40-45 మంది ఎమ్మెల్యేలపై ప్రజాగ్రహం ఉందని అర్ధమైపోతుంది.

ఆ కౌంట్‌ని తీసేస్తే..110 వరకు ఎమ్మెల్యేల పరిస్తితి పర్లేదు అని..కానీ ఎన్నికల నాటికి మరింత తగ్గితే వైసీపే రిస్క్‌లో పడవచ్చు. మ్యాజిక్ ఫిగర్ 88. అంటే మ్యాజిక్ ఫిగర్ కంటే 20 మంది ఎమ్మెల్యేల ఆధిక్యం వైసీపీకి ఉంది. కానీ అది మరింత తగ్గితే చిక్కులు తప్పవు. పైగా టీడీపీ-జనసేన పొత్తు ఫిక్స్ అయ్యేలా ఉంది. ఈ పరిణామాలని చూసుకుంటే నెక్స్ట్ వైసీపీకి గెలుపు కష్టమయ్యేలా ఉంది.