పోలిటికల్ రిస్క్‌లో వంశీ-కరణం..!

టీడీపీ నుంచి వైసీపీలోకి జంప్ చేసిన వారిలో ఒకరు చంద్రబాబుని తిట్టి…మరొకరు చంద్రబాబుని తిట్టక రాజకీయంగా రిస్క్‌లో పడ్డారని తెలుస్తోంది. అలా రిస్క్‌లో పడిన జంపింగ్ ఎమ్మెల్యేలు ఎవరో ఈపాటికి అందరికీ అర్ధమైపోయి ఉంటుంది. అనేక ఏళ్ళు టీడీపీలో పనిచేసి..2019 ఎన్నికల తర్వాత వైసీపీ వైపుకు వచ్చిన కమ్మ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం అని చెప్పొచ్చు. వీరిలో ఎవరో తిట్టి రిస్క్‌లో పడ్డారో తెలిసిందే.

వైసీపీ వైపుకు వచ్చాక వంశీ..ఏ విధంగా చంద్రబాబుని టార్గెట్ చేశారో తెలిసిందే. సరే రాజకీయంగా విమర్శలు చేస్తే పర్లేదు..హద్దులు దాటేసి మరీ..లోకేష్ పుట్టుక అంటూ..భువనేశ్వరిపై దారుణంగా మాట్లాడారు. దీనిపై పెద్ద రచ్చ జరిగింది. తర్వాత సారీ చెప్పారు గాని..అయినా సరే వంశీ ఎఫెక్ట్ అయ్యారు. ఇదే మాటలు ఇతర వైసీపీ నేతలు మాట్లాడారు గాని..వారిపై అంత ప్రభావం లేకుండా పోయింది. ఇంతకంటే కొడాలి నాని ఎక్కువ తిడతారు. కానీ రాజకీయంగా కొడాలి నానికి..గుడివాడలో ఇబ్బంది లేదు.

కానీ వంశీకి గన్నవరంలో రిస్క్ ఉంది. అక్కడ టీడీపీ బలం, నందమూరి అభిమానులు ఎక్కువ, కమ్మ వర్గం కూడా ఎక్కువే. ఇప్పుడు వారు వంశీకి యాంటీ అయ్యారు. అలాగే అక్కడ వైసీపీలో వర్గపోరు ఉంది. అసలైన వైసీపీ కార్యకర్తలు వంశీ వైపుకు రావడం లేదని తెలుస్తోంది. ఈ పరిస్తితుల్లో ఆచి తూచి అడుగేయాల్సిన వంశీ..కొడాలి నాని మాదిరిగా దూకుడుగా బూతులు తిట్టారు. దీంతో ఆయనకు పెద్ద మైనస్ అవుతుంది.

అటు కరణం బలరాం ఏమో వైసీపీ వైపు వెళ్లారు గాని..ఆయన చంద్రబాబుని ఒక్క మాట అనరు. ఇది వైసీపీ శ్రేణులకు నచ్చడం లేదు. పైగా ఈయన మళ్ళీ టీడీపీ వైపు వెళ్లిపోతారని ప్రచారం జరుగుతుంది. దీంతో నెక్స్ట్ ఈయన తనయుడు వెంకటేష్ గెలుపు సంగతి పక్కన పెడితే..సీటే పెద్ద డౌట్ అనే పరిస్తితి ఉంది. మొత్తానికి బాబుని తిట్టి వంశీ..తిట్టక కరణం రిస్క్‌లో పడ్డారు.