ఆదిపురుష్ సినిమా నుంచి అదిరే అప్‌డేట్‌.. ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్!

డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమా నుంచి ఇంతవరకు ఫస్ట్ లుక్ విడుదల చేయకపోవడంతో ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు తీపి కబురు అందిస్తూ ఆదిపురుష ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ డేట్ బయటికి వచ్చింది.

ప్రముఖ డైరెక్టర్ ఓం రౌత్ మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో ఆదిపురుష్ సినిమాని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాలో హీరో ప్రభాస్ ‘రాముడి’ పాత్రలో నటించగా, బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ ‘సీత’ ప్రాత్రలో నటించారు. ఆదిపురుష్ సినిమాను 2023, జనవరి 12న పాన్ వరల్డ్ లెవెల్‌లో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని మాత్రం రాముడి జన్మస్థలం అయిన అయోధ్య నగరంలో విడుదల చేయాలని ఆదిపురుష్ మూవీ టీమ్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది.

అయితే ఆది పురుష్‌ ఫస్ట్‌లుక్‌ని అక్టోబర్ 2న అయోధ్యలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ ఈవెంట్‌లో హీరో ప్రభాస్‌తో పాటు దర్శకుడు ఓం రౌత్ పాల్గొంటారని సమాచారం. వీరిద్దరితో పాటు ఇంకెవరైనా పాల్గొంటారా అనే దాని గురించి మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. టీజర్ లాంచింగ్‌కు మాత్రం అయోధ్య సరైన ప్లేస్ అని మేకర్స్ భావిస్తున్నారు. కాబట్టి ఫస్ట్ లుక్ ని అక్కడే లాంచ్ చేయాలి నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

అయోధ్యలో ఫస్ట్ లుక్ విడుదల చేసిన తర్వాత అక్టోబర్ 5న లవ్ కుష్ రామ్ లీలా కార్యక్రమానికి హాజరైవుతారని టాక్. అలానే అక్కడ జరిగే దసరా వేడుకలు, రావణాసురుడి దహన కార్యక్రమాలకు ప్రభాస్ హాజరవుతారని తెలుస్తోంది. ఆదిపురుష్ సినిమాలో లక్ష్మణుడిగా సన్నీ సింగ్, లంకేశ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్, హనుమంతునిగా దేవ్ దత్త నటిస్తున్నారు. ఈ సినిమాకి సాకేత్‌ పరంపర మ్యూజిక్ అందిస్తున్నారు.