భైరవద్వీపం సినిమా వెనుక నమ్మలేని నిజాలు.. ఇవే..!!

సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన జానపద చిత్రం భైరవద్వీపం . బాలకృష్ణ హీరోగా.. రోజా హీరోయిన్ గా అప్పట్లో ఈ సినిమా ఒక సంచలనం సృష్టించింది. అద్భుతమైన గ్రాఫిక్స్ .. రెక్కల గుర్రం.. మాంత్రికుని గుహ.. అల్లరి దెయ్యం.. అమ్మవారి విగ్రహం.. ఎగిరే మంచం.. బాలకృష్ణ కురూపి రూపం అన్నీ కూడా సినిమాను మరింత బ్లాక్ బస్టర్ గా తీర్చిదిద్దాయి. ముఖ్యంగా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా బాలయ్య, రోజాలకు కూడా మంచి బ్రేక్ ఇచ్చింది. ముఖ్యంగా విజయ సంస్థల అధినేతలలో ఒకరైన నాగిరెడ్డి కుమారులు వెంకట్రామిరెడ్డి తమ సోదరులతో కలిసి చందమామ విజయ కంబైన్స్ పేరిట 1981 లో సంస్థను నెలకొల్పి రాజేంద్రప్రసాద్ తో సింగీతం డైరెక్షన్లో బృందావనం సినిమా తీసి విజయాన్ని సాధించారు. ఇక తమ సంస్థలతో అనుబంధం ఉన్న రావి కొండలరావుకు నిర్మాణ బాధితుల అప్పగించడంతో పాదాల భైరవి మూవీలోని భైరవి తీసుకొని ద్వీపం జోడించి బైరవద్వీపం టైటిల్ను పెట్టారు.Bhairava Dweepam'

1993 జూన్ రెండవ తేదీన మద్రాస్ వాహిని స్టూడియోలో భైరవద్వీపం మూవీకి రజనీకాంత్ క్లాప్ కొట్టగా , చిరంజీవి స్విచ్ ఆన్ చేశారు .ఇక ఎన్టీఆర్ గౌరవ దర్శకత్వం వహించారు. నరుడా ఓ నరుడా పాటకు సమయం తీసుకోవడం, అంబా శాంభవి, స్వామి కోసం జలపాతంకి.. కష్టం మీద చేరుకొని పార్వతీ గుడి , ప్రతిమ సెట్టింగ్ వేశారు. చుట్టూ కొండల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు వెలుగు వచ్చేది. ఇక అప్పుడే షూటింగ్ మొదలు పెట్టేవారు. అద్దాల రాక్షసుల సీన్స్ కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేశారు. హార్బర్ క్రైమ్ తెచ్చి 15 రోజులపాటు మంచం ఎగరడం వంటి సీన్స్ చేశారు. అంతేకాదు మరుగుజ్జు కోసం నాలుగు లిల్లీపుట్ బొమ్మలు చేసి రిమోట్ కంట్రోల్ సహాయంతో ఆపరేట్ చేస్తూ షూట్ చేయడం జరిగింది.Bhairava Dweepamశ్రీ నారద తుంబుర పాట కోసం బాలయ్య ఎంతో సాధన చేశారు. అలా 235 రోజులు శ్రమించి నాలుగు కోట్ల 35 లక్షల రూపాయలతో ఈ సినిమాను తెరకెక్కించారు. 59 కేంద్రాలలో 50 రోజులు ఆడి చిన్న కేంద్రాల్లో 49 సెంటర్స్ లో వంద రోజులు ఆడి రికార్డు సృష్టించింది ఈ సినిమా. అంతేకాదు నరుడా ఓ నరుడా, శ్రీ తుంబుర పాటలకు జానకి అలాగే బాలసుబ్రహ్మణ్యం లకు నంది అవార్డులు కూడా లభించాయి. దర్శకుడితోపాటు మరో ముగ్గురికి నంది అవార్డులు కూడా లభించడం గమనార్హం. ఇకపోతే తమిళ్ తో పాటు హిందీలో కూడా రిలీజ్ చేసినప్పుడు నరుడా సాంగ్ ను ఆశాభోంస్లే పాడలేకపోవడంతో జానకితోనే ఈ పాట పాడించడం జరిగింది.