మంత్రులకు సొంత కష్టాలు..కష్టమేనా..!

ఇప్పుడు అధికారం ఉంది అని, జగన్ మెప్పు పొందాలని చెప్పి ఎడాపెడా నోరు పారేసుకునే మంత్రులు..పొరపాటున నెక్స్ట్ ఎన్నికల్లో ఓడిపోతే పరిస్తితి ఎలా ఉంటుంది..అలాగే టీడీపీ అధికారంలోకి వస్తే ఇంకా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలని, కాబట్టి మంత్రులు ఇప్పటినుంచే నోరు అదుపులో పెట్టుకోవాలంటూ టీడీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. వాస్తవానికి ఏపీలో దాదాపు అందరూ మంత్రులు..చంద్రబాబుని తిట్టడానికే ఉన్నారా? అనే విధంగా పనిచేస్తున్నారని చెప్పొచ్చు.

రాజకీయాలు గురించి అవగాహన ఉన్నవారికి మంత్రులు ఏం చేయాలనేది బాగా తెలుసు. ప్రజలకు సేవ చేయాలి..తమ తమ శాఖలకు సంబంధించిన పనులు చేయాలి. కానీ మంత్రులు మాత్రం తమ శాఖలకు సంబంధించి తప్ప..చంద్రబాబుని లేదా పవన్ కల్యాణ్ తిట్టడానికే ప్రెస్ మీట్లు పెడుతున్నట్లు కనిపిస్తున్నారు. అసలు ప్రెస్ మీట్లు పెట్టేది వారిని తిట్టడానికే అని అర్ధమైపోతుంది.  సరే ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చినప్పుడు వాటికి కౌంటర్లు ఇవ్వాలి..అలా కాకుండా అసలు విమర్శలు వదిలేసి..ఎదురుదాడి చేసి..బూతులు తిట్టడం వల్ల వైసీపీకి వచ్చే లాభం ఏమి లేదు..అలా అని టీడీపీకి జరిగే నష్టం లేదు.

ఎటు తిరిగి మంత్రులకే నష్టం అయ్యేలా ఉంది..పైగా ఇదే పనిలో ఉంటూ..మంత్రులు తమ తమ సొంత నియోజకవర్గాలని పట్టించుకొని స్థితిలో ఉంటున్నారు. దీంతో వీరికి అసలుకే మోసం వస్తుంది. పైగా మంత్రుల మతలపై సొంత నియోజకవర్గం ప్రజలే అసంతృప్తితో కనిపిస్తున్నారు..ఫలితంగా అలా దూకుడుగా మాట్లాడే మంత్రులు..నెక్స్ట్ ఎన్నికల్లో గెలవడం జరిగే పని కాదని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.

ముఖ్యంగా అప్పలరాజు-పలాస, అమర్నాథ్-అనకాపల్లి, రోజా-నగరి, రజిని-చిలకలూరిపేట, నాగార్జున-వేమూరు, అంబటి-సత్తెనపల్లి, ఉషశ్రీచరణ్-కళ్యాణదుర్గం, కారుమూరి-తణుకు, కొట్టు సత్యనారాయణ-తాడేపల్లిగూడెం, జోగి రమేష్-పెడన..ఇలా కొందరు మంత్రులకు సొంత స్థానాల్లోనే వ్యతిరేకత ఉందని, వీరు నెక్స్ట్ గెలిస్తే గ్రేట్ అంటూ టీడీపీ సవాళ్ళు విసురుతుంది. ఇంకా కొందరు మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని వారికి కూడా ప్రజలు బుద్ధి చెబుతారని మాట్లాడుతున్నారు. మరి టీడీపే శాపాలు ఫలిస్తాయో లేదో చూడాలి.