అభిమానులకు పిచ్చెక్కించే అప్డేట్..బాలయ్యతో మరో క్రేజీ డైరెక్టర్.. కథ ఇదే..!

సీనియర్ హీరోలలో బాలకృష్ణ టాలీవుడ్ లో మంచి సక్సెస్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా షూటింగ్లో బిజీగాఉన్నాడు. ఈ సినిమాను డిసెంబర్‌లో లేదా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే విధంగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి తో తన 108 సినిమా షూటింగ్లో బిజీ అవ్వ‌నున్న‌డు.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయ్యాయి. రెగ్యులర్ షూటింగ్ కూడా దసరా నుంచి మొదలుకానుందని తెలుస్తుంది.

ఈ సందర్భంలోనే బాలయ్య తన తర్వాత సినిమాల గురించి సోషల్ మీడియాలో చాలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే బాలయ్య ఇప్పుడు బాబీ డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడని ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుందని కూడా తెలుస్తుంది. అయితే బాబి ఇప్పుడు చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు.

ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే బాలయ్యకు బాబీ ఒక కథ చెప్పినట్టు తెలుస్తుంది.. కథ నచ్చడంతో బాలయ్య సినిమాకి ఓకే చెప్పినట్టు కూడా తెలిసింది. ఈ సందర్భంలోని చిరంజీవి సినిమా పూర్తి అయిన వెంటనే బాబీ బాలయ్య సినిమాపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తుంది.