హవ్వా..లాస్య ప్రెగ్నెంట్..యాంకర్ రవి సంచలన నిర్ణయం..!?

మనకు తెలిసిందే బుల్లితెరపై యాంకర్ లాస్య-రవి జంటకు ఎంత క్రేజ్ ఉందో . గతంలో వీళ్ళు హోస్ట్ చేసిన సంథింగ్ సంథింగ్ అనే షో బీభత్సమైన టిఆర్పిను సంపాదించుకొని బిగ్ హిట్ గా నిలిచింది. అంతేకాదు పలు ఈవెంట్స్ లో కూడా యాంకర్ లాస్య రవి కలిసి వర్క్ చేయడంతో తెరపై ఈ ఇద్దరు జంటకు ఫ్యాన్స్ అయిపోయారు జనాలు. దీంతో ఈ జంట మధ్య సంథింగ్ సంథింగ్ ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు అప్పట్లో యాంకర్ రవి లాస్యకు ప్రపోజ్ చేశాడని ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమెను టార్చర్ చేశాడని కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ లో వార్తలు వైరల్ అయ్యాయి.

ఇవన్నీ పక్కన పెడితే గత కొంతకాలంగా లాస్య-రవి మళ్ళీ కలిసిపోయారు. బిగ్ బాస్ తర్వాత యాంకర్ లాస్య – రవి తమ మధ్య జరిగిన గొడవలన్నీ మర్చిపోయి ఒకటయ్యారు. మాటీవీ కూడా ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేసి మరి వీరి ఇద్దరిని కలిపింది . అయితే షో కోసం కలిశారు కానీ వీళ్ళు రియల్ గా కలవలేదు అంటూ అప్పట్లో కొన్ని వార్తలు వైరల్ అయ్యాయి. లాస్య మంజునాథ్ తో హ్యాపీగా ఉంది ..యాంకర్ రవి తన భార్య నిత్యతో హ్యాపీగా ఉన్నాడు . ఆ తర్వాత యాంకర్ రవి కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళాడు. ఆ టైంలో కూడా యాంకర్ లాస్య పెద్దగా రవికి సపోర్ట్ చేయలేదు. ఇవన్నీ గమనించిన జనాలు వీళ్ళ మధ్య ఇంకా వార్ జరుగుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే రీసెంట్ గా యాంకర్ లాస్య రెండోసారి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ చేసింది. దీంతో ఆమె అభిమానులు సంతోషం తో ఊగిపోతున్నారు. యాంకర్ లాస్య రెండోసారి తల్లి అవ్వాలని.. ఆమెలాంటి అందమైన పాప పుట్టాలని ఫ్యాన్స్ కోరుకున్నారు. అనుకున్న విధంగానే యాంకర్ లాస్య రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధపడింది . ఆమె రీసెంట్ గానే తన సెకండ్ ప్రెగ్నెన్సీ న్యూస్ ని అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది . అయితే దీంతో కొందరు యాంకర్ రవి హేటర్స్ ఆయన పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేస్తున్నారు . ప్రతి విషయంలో లాస్య తో కాంపిటీషన్ పడే యాంకర్ నువ్వు ఈ విషయంలో కూడా కాంపిటీషన్ గా తీసుకొని రెండో బిడ్డను కనడానికి సిద్ధపడతావా..? అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. అంతేకాదు “ఏం రవి లాస్య సెకండ్ బేబీని అనౌన్స్ చేసింది మరి నువ్వు “అంటూ వల్గర్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో యాంకర్ రవి పై లేనిపోని నిందలు వేసి ఆయన పరువు తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.