నో డౌట్: ఆ సీటు వైసీపీదే!

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే..మొదట నుంచి జిల్లాలో టీడీపీకి అనుకూలంగా ఫలితాలు వస్తూ ఉండేవి…గత ఎన్నికల్లో మాత్రం వెస్ట్ లో వైసీపీకి అనుకూలంగా ఫలితాలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ సీన్ మారుతూ వస్తుంది…ఇక్కడ టీడీపీ మళ్ళీ బలపడుతుంది…అటు జనసేన కూడా కొన్ని స్థానాల్లో పికప్ అవుతుంది. ఇలాంటి తరుణంలో నెక్స్ట్ వెస్ట్ లో వైసీపీకి అనుకున్నంతగా మంచి ఫలితాలు రావడం కష్టం.

పైగా టీడీపీ-జనసేన గాని కలిసి పోటీ చేస్తే వైసీపీ పరిస్తితి ఏం అవుతుందో ఊహించుకోవచ్చు. అయితే రెండు పార్టీలు విడిగా పోటీ చేసిన, కలిసి పోటీ చేసినా సరే ఒక సీటులో మాత్రం వైసీపీ గెలుపు ఆపడం కష్టమని తెలుస్తోంది. వైసీపీ డౌట్ లేకుండా ఆ సీటులో గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలా వైసీపీ ఈజీ గెలిచే సీటు ఏదో కాదు…ఎస్టీ రిజర్వడ్ నియోజకవర్గం పోలవరం. ఇక్కడ మొదట్లో టీడీపీకి అనుకూల వాతావరణం ఉండేది కానీ…2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటింది.

Andhra Pradesh, Apr 27, (ANI): Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy addresses the public during a press conference, at the camp office in Tadepalli at Guntur District on Monday. (ANI Photo)

తెల్లం బాలరాజు రెండు సార్లు కాంగ్రెస్ నుంచి గెలిచారు…తర్వాత ఆయన వైసీపీలోకి వెళ్ళి 2012 ఉపఎన్నికలో కూడా గెలిచారు…ఇక 2014లో ఓడిపోగా, 2019లో మరోసారి సత్తా చాటారు. ఇలా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాలరాజుకు పోలవరంలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. రాష్ట్రంలో చాలాచోట్ల వైసీపీ ఎమ్మెల్యేల బలం తగ్గుతుంటే…పోలవరంలో మాత్రం బాలరాజు బలం పెరుగుతుంది.

పైగా ఇక్కడ టీడీపీ వీక్ గా ఉండటం, టీడీపీలో గ్రూపు తగాదాలు ఉండటం వైసీపీకి ప్లస్. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మోడియం శ్రీనివాసరావుకు, గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన బొరగం శ్రీనివాస్ లకు పడటం లేదు. ఇద్దరు నేతలు సెపరేట్ గా గ్రూపులు నడుపుతూ…పోలవరంలో టీడీపీని డ్యామేజ్ చేస్తున్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఒకరికి సీటు ఇస్తే మరొకరు సహకరించే పరిస్తితి లేదు. ఇక్కడ జనసేనకు పెద్దబలం లేదు. ఎటు చూసుకున్న మళ్ళీ పోలవరం సీటు వైసీపీ ఖాతాలో పడేలా ఉంది.