బాప్‌రే: లైగర్‌ కోసం రమ్యకృష్ణ కళ్లు చెదిరే రెమ్యూనరేషన్.. ఎన్ని కోట్లు అంటే..?

అయిపోయింది, అంతా అయిపోయింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన లైగర్ సినిమా అట్టర్ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కలిసి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమానే ఈ లైగర్ . టాలీవుడ్ డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి.. అట్టర్ ఫ్లాప్ టాక్ ని సొంతం చేసుకుంది. సినిమా పై ముందు నుండే భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్న అభిమానులు ఫస్ట్ షో బొమ్మ పడగానే సినిమా సీన్ అర్ధమైపోయింది. దీంతో కలెక్షన్స్ కూడా భారీ స్దాయిలో పడిపోయాయి. సినిమా దారుణాతి దారుణమైన టాక్ ను సంపాదించుకుంది.

కాగా సినిమా ఫ్లాప్ టాక్ సంపాదించుకున్నా హీరో విజయ్ దేవరకొండ నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయి. అంతేకాదు హీరో తల్లిగా చేసిన రమ్యకృష్ణ జనాల మనసులను దోచేసింది. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో హీరోయిన్ అనన్య పాండే కన్నా కూడా హీరో తల్లిగా నటించిన రమ్యకృష్ణ నే బాగా చేసిందంటూ జనాలు చెప్పుకుంటున్నారు. సినిమా చూసిన ఎవరికైనా సరే రమ్యకృష్ణ పాత్ర ..ఆమె నటన నచ్చి తీరాల్సిందే. అంత బాగా నటించింది రమ్యకృష్ణ. అఫ్ కోర్స్ ఆమె గురించి ఆమె నటన గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు . ఇప్పటికీ తనదైన స్టైల్ లో సినిమాలలో నటిస్తూ తన నట విశ్వరూపాని చూయిస్తుంది.

కాగా ఈ సినిమాలో హీరోకి ఎంత స్కోప్ ఉందో హీరో తల్లిగా కూడా రమ్యకృష్ణ కు అంతే వాల్యూ ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చిన క్యారెక్టర్స్ రెండే రెండు. ఒకటి విజయ్ దేవరకొండ రెండు రమ్యకృష్ణ. అంత బాగా తనలోని మరో మాస్ యాంగిల్ ని బయటకు తీసుకొచ్చి పూరి చెప్పిన డైలాగ్స్ ను ఉన్న విధంగా చెప్పుకోచ్చి శభాస్ అనిపించుకుంది. ఈ సినిమా ద్వార తనలోని మరో నటిని బయటకు తీసుకొచ్చింది. కాగా ఈ సినిమా కోసం రమ్యకృష్ణ తీసుకున్న రెమ్యూనరేషన్ నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం రమ్యకృష్ణ దాదాపు 3 కోట్ల 50 లక్షలు తీసుకున్నట్లు తెలుస్తోంది .నిజానికి ఈ సినిమాలో కోచ్ గా నటించినా రోనిత్ రాయ్ కేవలం 1.50 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. కానీ హీరో తల్లిగా నటించినా రమ్యకృష్ణ మాత్రం ఆయనకు డబుల్ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకొని షాక్ ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు “సినిమాలో ఆమె నటించిన దానికి.. అది కూడా తక్కువే ఇంకా ఎక్కువ ఉండాలి” అంటూ కామెంట్ చేస్తున్నారు . ఇక సినిమాకు హైలెట్‌ రోల్‌గా మొదటి నుంచి పేరు తెచ్చుకు మైక్‌ టైసన్‌ విజయ్‌ కంటే ఎక్కువగా రూ. 40 కోట్లు అందుకున్నాడని తెలుస్తోంది.