తెలుగు సినిమాల గురించి సంచలన నిర్ణయం తీసుకున్న సమంత .షాక్ లో అభిమానులు..

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దాదాపు దశాబ్దకాలం హీరోయిన్ గా వెలిగిన సమంత తర్వాత నాగచైతన్య ని పెళ్ళాడి అక్కినేని ఇంటి కోడలయింది.పెళ్లయిన కూడా సమంత కెరీర్ లో చాల మంచి సినిమాలు చేసింది.బాలీవుడ్ లో వెబ్ సిరీస్ కూడా చేసి నటి గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.అయితే తర్వాత అభిప్రాయ బేధాల కారణంగా చై,సామ్ ఇద్దరు విడిపోయారు.

ఎపుడు సోషల్ మీడియా లో ఎంతో ఆక్టివ్ గా వుండే సమంత గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉంటోంది.సమంత తెలుగు లో సమంత ఖుషి,శాకుంతలం సినిమాలు చేస్తోంది.అయితే ఆమె ఇటీవల ఒక బాలీవుడ్ వెబ్ సిరీస్ కి సైన్ చేసినట్టు తెలుస్తోంది.ఫామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంత నటన కి చాల మంచి పేరు తెచ్చుకుంది.ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ ని హిందీ లో రీమేక్ చేస్తున్నారు.ఇందులో వరుణ్ ధావన్ మెయిన్ రోల్ చేస్తున్నారు..ఈ వెబ్ సిరీస్ లో ఒక లీడింగ్ రోల్ లో నటించే అవకాశం సమంత కి దక్కిందని టాక్ వినిపిస్తుంది.ఈ సిరీస్ లో కూడా ఆక్షన్ సన్నివేశాల కోసం సమంత అమెరికా లో ట్రైనింగ్ తీసుకుంటుంది ,ఈ సిరీస్ లో ఒక కొత్త పాత్రలో సమంత కనిపించబోతున్నారు.ఇది కూడా రాజి పాత్ర లాగా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుంది అని ఆశిస్తోంది సమంత.ప్రస్తుతం సమంత దీని గురించి హైదరాబాద్ నుండి ముంబై కి ట్రావెల్ చేస్తోంది.

హైదరాబాద్ నుండి ముంబై కి ట్రావెల్ చేసే పని లేకుండా సమంత ఇపుడు ముంబై కి మకాం మార్చాలనుకుంటున్నారట.అందుకే ముంబై లో ౩౦ కోట్లు విలువ చేసే ఇంటిని కొనుగోలు చేసారని టాక్.ఆల్రెడీ ఈ సిరీస్ కోసం అగ్రిమెంట్ కూడా సైన్ చేసారని,ఈ సిరీస్ మూడు నెలల్లో విడుదల కాబోతుందని భోగట్టా.ఈ వెబ్ సిరీస్ కూడా హిట్ అయితే ఇక సమంత ముంబై లో నే సెటిల్ అవుతారేమో?ఒక వేళా అదే నిజం అయితే సమంత ఇక టాలీవుడ్ కి దూరమయినట్టేనా??లేదంటే రెండు ఇండస్ట్రీస్ లో నటిస్తారా?? ఇది తెలియాలంటే వేచి చుడాలిసిందే.