వింత ఆచారం కాదిది అదో రోగం… అక్కడ పెళ్లైన జంటలు ఇతరులతో సెక్స్ చేయాలట?

రోజులు మారుతున్నప్పటికీ ఇప్పటికీ అనేక ప్రాంతాల్లోని ప్రజలు కొన్ని వింత ఆచారాలను కొనసాగిస్తున్నారు. కొన్ని తెగలు ఇప్పటికీ ఎన్నో అనాగరికమైన ఆచారాలను ఎంకరేజ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎందరో సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చి, అనేక రాక్షసమైన ఆచారాలను ఇప్పటికే అంతం చేసారు. అయితే కొన్ని ప్రాంతాల్లో కొన్ని తెగల్లో మాత్రం నేటికీ వింత ఆచారాలు సాగుతూనే ఉంటాయి. తమకు ఇష్టం లేకపోయినా, అక్కడి యువతీయువకులు బలవంతంగా అటువంటి ఆచారాలు పాటించాల్సి వస్తోంది.

ఇపుడు అలాంటి ఓ తెగ గురించి మాట్లాడుకుందాం. ఇండోనేషియా దేశంలోని జావా ద్వీపంలో ఓ పనికిమాలిన ఆచారం ఇప్పటికీ కొనసాగుతోంది. అదేమిటంటే.. కొత్తగా పెళ్లైన జంట.. ఓ కొండమీదకు వెళ్లి అపరిచితులతో రాత్రంతా సెక్స్ చేయాలి. ఇలా ఒక్కసారి కాదు సంవత్సరంలో 7 సార్లు చేయాలి. జావా ద్వీపంలో కెముకస్ అనే ఓ పర్వతం ఉంది. ఆ పర్వతం మీద ఉన్న ఆలయంలో పోన్ వేడుకలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భాగంగా కొత్తగా పెళ్లైన జంట తమకు తెలియని అపరిచిత వ్యక్తులతో శృంగారంలో పాల్గొనాలి.

వింటేనే భయంకరంగా వుంది కదూ. అయితే దీని వెనక ఓ పెద్ద కథ ఉందని అక్కడి ఆటవికులు చెప్పుకుంటున్నారు. సుమారు 16 వ శతాబ్ధంలో ‘జావా ప్రిన్స్ సమోద్రో’ అనే రాజు అతడి ప్రేయసితో ఈ కొండమీద ఏకాంతంగా ఉన్నాడట. ఆ టైంలో సైనికులు అతడిని చంపి పర్వతంపైనే పూడ్చి పెట్టారట. ఇదిగో అప్పటి నుంచి ఇక్కడ ఈ ఆచారం కొనసాగుతున్నది అని చెప్పుకొస్తున్నారు. ఆ రోజు అతడి ప్రేయసిని చంపేస్తే… ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్నవాళ్లు ఎందుకోసం అపరిచితులతో శృంగారం చేయాలో అనే విషయంపై
అయితే క్లారిటీ లేదు.