అదొక్కటే నా కోరిక.. ఎన్టీఆర్ కి లక్ష్మీపార్వతీ రిక్వెస్ట్..

ఎన్టీఆర్ ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే..ఇక ‘ఆర్ఆర్ఆర్’ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎన్టీఆర్ ను ప్రత్యేకంగా కలిసి అభినందించారు. అయితే ఈ భేటీపై భిన్న వాదనలు వస్తున్నాయి. కేవలం అభినందించేదుకే అమిత్ షా భేటీ అయ్యారని బీజేపీ శ్రేణులు అంటుంటే.. ఇది రాజకీయ భేటే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.. అయితే ఈ భేటీలో ఏం చర్చించుకున్నారనే విషయం మాత్రం బయటకు రాలేదు..

కాగా, ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై తెలుగు, సంస్కృత అకాడమీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతీ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని, తాతా దివంగత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీని స్వాధీనం చేసుకోవాలని కోరారు. అదొక్కటే తన కోరిక అని లక్ష్మీ పార్వతీ చెప్పుకొచ్చారు. చంద్రబాబు నాయుడు దివంగత ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారని, టీడీపీని స్వాధీనం చేసుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ కి లక్ష్మీ పార్వతీ రిక్వెస్ట్ చేశారు. తిరుపతిలో జరిగిన గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతి కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు..

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎస్వీ యూనివర్సిటీ వేదికగా గిడుగు భాషా ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఆరుగురికి పురస్కార గ్రహీతలుగా ఎంపిక చేశామని చెప్పారు. సీఎం జగన్ విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం విద్యను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. తెలుగు భాషకు సీఎం జగన్ ద్రోహం చేస్తున్నారని వస్తున్న కామెంట్స్ లో నిజం లేదన్నారు. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెబుతున్న వారే.. వారి పిల్లలను ఇంగ్లీస్ మీడియంలో చదివిస్తున్నారని విమర్శించారు. పేద పిల్లల కోసం ఇంగ్లీస్ మీడియం తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు.