చైనాలో తెలుగోడి సత్తా ఏంటో చాటిన ఎన్టీఆర్.. అసలు విషయం ఏమిటంటే.?

అప్పట్లో స్టార్ హీరోలు కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తెలుగులో నటించిన సినిమాలతో వివిధ దేశాలలో కూడా సత్తా చాటే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక అలాంటివారిలో స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఒకరు. ఇక ఈయన నటించిన ఒక సినిమా చైనాలో ఏకంగా వంద రోజులు థియేటర్లో ఆడి అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ఇక ఎన్టీఆర్ నటించిన ఆ చిత్రం గురించి ఇప్పుడు ఒకసారి చదువు తెలుసుకుందాం.

సాధారణంగా మన దేశంలో ఉన్న భాషలలో మాత్రమే కాకుండా విదేశాలలో కూడా థియేటర్లలో ఆడి సత్తా చాటిన సినిమా ఏదైనా ఉంది అంటే రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా అని చెప్పవచ్చు. ఇక ఆ సినిమా తర్వాత ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా అన్ని రికార్డులను సొంతం చేసుకుంటోంది. కానీ అంతకుముందే ఒక సినిమా మన దేశంలోనే కాదు ఇతర దేశాలలో కూడా 100 రోజులు ఆడి రికార్డు సృష్టించిందంటే ఎవరైనా నమ్మగలరా ?అది కేవలం ఎన్టీఆర్ కి మాత్రమే సాధ్యమైంది. ఇక చైనాలో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న చిత్రం ఏమిటంటే బి. ఎన్. రెడ్డి దర్శకత్వంలో నందమూరి తారకరామారావు హీరోగా భానుమతి హీరోయిన్ గా తెరకెక్కిన మల్లీశ్వరి.ఆ హీరోయిన్ తో సినిమా చేయనని చెప్పి.. చివరికి ఆ హీరోయిన్ తోనే బ్లాక్ బస్టర్  కొట్టిన ఎన్టీఆర్

ఇక ఒకప్పుడు ఎన్టీఆర్ భానుమతితో నటించడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. అందుకే ఈ సినిమాకు కూడా ఆయన అయిష్టంగానే ఒప్పుకోవాల్సి వచ్చింది. బహుభాషా చిత్రమని దర్శకుడు బి. ఎన్. రెడ్డి ఎన్టీఆర్ తో చెప్పడంతో మరో మాట లేకుండా సినిమాకు ఓకే చేశారు. ఇక అలా ఇష్టం లేకపోయినా నటించడానికి ఒప్పుకున్న నందమూరి తారక రామారావు , భానుమతి కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడమే కాకుండా అరుదైన రికార్డులను కూడా సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో మంచి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడమే కాకుండా చైనాలో కూడా 100 రోజులు ఆడి రికార్డు సృష్టించింది.