తన బాబాయ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయిన కళ్యాణ్ రామ్!

నందమూరి కళ్యాణ్ రామ్ గురించి పరిచయం అక్కర్లేదు. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన మంచి నటులలో హీరో కళ్యాణ్ రామ్ ఒకరిని చెప్పవచ్చు. ఈయన తాజాగా బింబిసార అనే సినిమాలో నటించిన విషయం తెలిసినదే. ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. దాంతో సినిమా ప్రమోషన్స్ షురూ చేసారు. ఈ ప్రమోషన్లో భాగంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తన కెరియర్లో జరిగిన కొన్ని సంఘటనలు తన చిన్ననాటి సంగతులను గురించి తెలియజేశారు. వాటి గురించి ఇప్పుడు టాలీవుడ్లో పెద్ద చర్చే నడుస్తోంది.

ఈ సందర్భంగా మొదట కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తన బాబాయ్ బాలకృష్ణ గురించే మాట్లాడారు. బాలగోపాలుడు అనే సినిమా ద్వారా చైల్డ్ ఆర్టిస్టుగా తన బాబాయ్ బాలకృష్ణ ఈ సినిమా పరిశ్రమకి పరిచయం చేసారని చెబుతూ చాలా ఎమోషనల్ అయ్యారు. తను అప్పుడు నైన్త్ క్లాస్ చదువుతున్నాడట. అప్పుడు కళ్యాణ్ రామ్ తండ్రిని బాలకృష్ణ అడిగారట.. “అన్నయ్య! నేను కళ్యాణ్ ని సినిమాలకు పరిచయం చేస్తాను!” అని అన్నాడట. అప్పుడు హరికృష్ణ మాట్లాడుతూ కళ్యాణ్ రామ్ ఇంకా చదువుకుంటున్నాడు కదా ఎలా అని హరికృష్ణ చెప్పాడట. అవన్నీ నేను చూసుకుంటాను అని బాలయ్య బాబాయ్ చెప్పారని తెలిపారు కళ్యాణ్.

అయితే సినిమాలలో యాక్ట్ చేయడం అంటే కెమెరా ముందు ఎలా ఉండాలో కళ్యాణ్ రామ్ కు అస్సలు తెలియలేదట. కేవలం తన బాబాయ్ సహకారంతోనే బాలగోపాలుడు అనే సినిమాలో కెమెరా ఫేస్ చేసానని చెప్పుకొచ్చాడు. ఇక తన మొదటి చిత్రం కాశీవిశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చింది అని, ఆ సినిమాకి రామోజీరావు గారు నిర్మాత అని తెలిపారు. ఇక కళ్యాణ్ రామ్ మొదటి రెండు చిత్రాలు తొలిచూపులోనే, అభిమన్యు సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఢీలా పడిన కళ్యాణ్ రామ్ ని తన బాబాయ్ ఓదార్చి మోటివేషన్ చేసారని చెప్పుకొచ్చాడు.