వైసీపీ ఎమ్మెల్యే అన్నాకు `ఫైర్ పాలిటిక్స్‌` సెగ‌..!

అన్నా రాంబాబు. ఆయ‌న ఎక్క‌డ ఉన్నా..రాజ‌కీయ ఫైర్ బ్రాండ్. పార్టీ ఏదైనా.. త‌న మాటే నెగ్గాల‌నే పం తం.. ఫైర్‌.. ఉన్న‌నాయ‌కుడు. ఇదే ఫైర్‌.. ఇప్ప‌డు ఆయ‌నకు రాజ‌కీయంగా సెగ పెడుతోంది. ప్ర‌జారాజ్యం పార్టీతో రాజ‌కీయ అరంగేట్రం చేసిన అన్నా.. 2009లో విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత‌.. ప్ర‌జారాజ్యం కాంగ్రెస్‌లో విలీనం అయిపోయిన త‌ర్వాత‌.. అనంత‌ర కాలంలో జ‌రిగిన మార్పుల నేప‌థ్యంలో టీడీపీలోకి వ‌చ్చారు. 2014లో గిద్ద‌లూరు నియోజ‌క‌వ‌ర్గంనుంచి పోటీ చేసి విజ‌యంద‌క్కించుకున్నారు.

అయితే.. స్వ‌ప‌క్షంలోనే విప‌క్షం అనేలా.. ఆయ‌న నాయ‌కుల‌తో క‌ల‌గ‌లుపుగా లేక‌పోవ‌డంతోపాటు.. ప్ర‌భు త్వంపైనా.. పార్టీ ప‌గ్గాల‌పైనా వివాదాలు పెట్టుకుని.. కార్యాల‌యాల్లోనే ధ‌ర్నాలు.. నిర‌స‌న‌లు చేసి.. టీడీపీ లో చీప్ అయ్యారు. ఇక‌, ఈ క్ర‌మంలోనే అన్నాకు టికెట్ ఇవ్వొద్ద‌ని.. ఇస్తే.. తాము ఓడిస్తామ‌ని.. 2019 ఎన్నిక లకు రెండేళ్ల ముందు నుంచి అన్నాకు వ్య‌తిరేకంగా.. త‌మ్ముళ్లు రోడ్డెక్కారు. దీంతో టీడీపీ నుంచి త‌న‌కు టికెట్ ద‌క్క‌ద‌ని అనుకున్న అన్నా.. వైసీపీ బాట ప‌ట్టారు.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అన్నా.. భారీ విజ‌యం ద‌క్కించుకున్నారు. సీఎం జ‌గ‌న్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లో ద‌క్కించుకున్న మెజారిటీ త‌ర్వాత రాష్ట్రంలో అన్నానే ఎక్కువ మెజారిటీ ద‌క్కించుకున్నారు. మ‌రి ఇంత మెజారిటీ ద‌క్కించుకున్న అన్నా..వైసీపీలో అంద‌రినీ క‌లుపుకొని పోవాలి క‌దా! కానీ.. అలా చేయ‌డం లేదు. ఎక్క‌డిక‌క్క‌డ త‌న మాటే వినాల‌ని.. మ‌ళ్లీ ఫైర్ పాలిటిక్స్ తెర‌మీదికి తెచ్చారు. ఇది స్థానికంగా ఉన్న వైసీపీ నాయ‌కుల‌కు న‌చ్చ‌డం లేదు.

దీంతో వారు.. అన్నాకు వ్య‌తిరేకంగా గ్రూపు రాజ‌కీయాలు చేస్తున్నారు. అన్నాకు టికెట్ ఇవ్వొద్ద‌ని.. ఇస్తే.. ఖ‌చ్చితంగా తాము పార్టీని వీడుతామ‌ని.. ఈ విష‌యంలో రెండో మాటేలేద‌ని.. అంటున్నారు. ఈ విష‌యాన్ని నేరుగా తాడేప‌ల్లి సీఎం క్యాంకు కార్యాల‌యానికి సైతం అందించారు. దీంతో అధిష్టానం నేరుగా.. అన్నాను రావాలని ఆదేశించిన‌ట్టు తెలిస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న త‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని.. తీవ్ర‌స్థాయిలో యాగీ చేయ‌డం తెలిసిందే. అయితే.. దీనివెనుక ఈ అస‌మ్మ‌తి నేత‌లే ఉన్నార‌ని.. స‌మాచారం. మొత్తానికి అన్నా ఫైర్ పాలిటిక్స్ ఆయ‌న‌కు బాగానే సెగ‌పెడుతున్నాయ‌ని అంటున్నారు.