ఒకే హీరోయిన్‌తో ఒకటి కంటే ఎక్కువ సినిమాలు తీసిన డైరెక్టర్లు వీళ్లే…!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల కాంబో రిపీట్ అవుతుండటం ఎంత అరుదో డైరెక్టర్లు హీరోయిన్ల కాంబో రిపీట్ కావడం కూడా అంతే అరుదు. అయితే డైరెక్టర్లు తమకు బాగా అచ్చొచ్చిన లేదా బాగా నచ్చిన హీరోయిన్లను ఏరికోరి మరీ తమ తదుపరి సినిమాల్లో ఎంచుకుంటుంటారు. అయితే టాలీవుడ్ డైరెక్టర్లు ఇలాగే కొందరు హీరోయిన్లను ఒకటి కంటే ఎక్కువసార్లు ఎంచుకున్నారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.

1. త్రివిక్రమ్ శ్రీనివాస్ – పూజా హెగ్డే

అరవింద సమేత వీర రాఘవ, అల వైకుంఠపురంలో, మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ కోసం పూజా హెగ్డేకే త్రివిక్రమ్ ఓటేశాడు.

2. వి.వి.వినాయక్ – నయనతార

లక్ష్మీ, యోగి, అదుర్స్ ఈ మూడు సినిమాలను వివి వినాయక్ డైరెక్ట్ చేయగా… వాటన్నిటిలో హీరోయిన్‌గా నయనతార నటించింది.

3. హరీష్ శంకర్ – శృతి హాసన్

గబ్బర్ సింగ్ సినిమాతో హరీష్ శంకర్ శృతిహాసన్ క్రేజ్‌ని వేరే లెవెల్‌కి తీసుకెళ్లాడు. మళ్లీ ఈమెతో రామయ్యా వస్తావయ్యా సినిమాలో కలిసి పని చేశాడు.

4. శీను వైట్ల – జెనీలియా డిసౌజా

శ్రీను వైట్ల తెరకెక్కించిన కామెడీ చిత్రాలైన ఢీ, రెడీలో జెనీలియా కథానాయకిగా తళుక్కుమంది.

5. శేఖర్ కమ్ముల – సాయి పల్లవి

ఫిదా సినిమాతో సాయి పల్లవిని 16 అణాల అచ్చ తెలుగు అమ్మాయిలా శేఖర్ కమ్ముల మనందరికీ పరిచయం చేశాడు. మళ్లీ లవ్ స్టోరీ సినిమాతో ఆమెను కొత్త అవతారంలో చూపించి మనసులను చూరగొన్నాడు.

6. గౌతమ్ వాసుదేవ్ మీనన్ – సమంత అక్కినేని

ఏ మాయ చేసావే సినిమాతో సమంతని మోస్ట్ రొమాంటిక్ అవతారంలో ఇంట్రడ్యూస్ చేశాడు గౌతమ్ మీనన్. ఆ తర్వాత ఎటో వెళ్ళిపోయింది మనసు సినిమాతో వీరిద్దరి కాంబోలో రిపీట్ అయింది.

7. వై.వి.ఎస్ చౌదరి – ఇలియానా

వై.వి.యస్.చౌదరి డైరెక్ట్ చేసిన దేవదాసు, సలీం రెండు సినిమాల్లోనూ ఇలియానా యాక్ట్ చేసింది.

8. వెంకీ కుడుముల – రష్మిక మందన

వెంకీ కుడుముల డైరెక్ట్ చేసిన ఛలో, భీష్మ సినిమాల్లో రష్మిక మందన మెరిసింది.

9. పూరీ జగన్నాథ్ – కాజల్ అగర్వాల్

పూరీ జగన్నాథ్ తన బిజినెస్ మ్యాన్, టెంపర్ మూవీల కోసం కాజల్ ని హీరోయిన్ గా ఎంచుకున్నాడు.

10. ఎస్.ఎస్.రాజమౌళి – అనుష్క శెట్టి

విక్రమార్కుడు, బాహుబలి సినిమాల కోసం అనుష్క శెట్టిని రాజమౌళి తీసుకున్నాడు.