సర్కారు వారి పాట రివ్యూ: సినిమాకి హైలెట్ పాయింట్ అదే..ఇరగదీశాడు..!!

అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఆశ గా ఎదురు చూసిన రోజు రానే వచ్చేసింది. టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ కలిసి హీరో హీరోయిన్లు గా నటించిన సినిమా “సర్కారు వారి పాట” కొద్ది గంటల క్రితమే ధియేటర్ లో రిలీజ్ అయ్యి పాజిటీవ్ టాక్ ను సొంతం చేసుకుంది. దర్శకుడు పరశూరామ్ తన దైన స్టైల్ లో చాలా కూల్ గా.. మధ్య మధ్య లో మాస్ డైలాగ్స్ వాడుతూ.. అభిమానుల కోసం యాక్షన్ సీన్స్ పెట్టి..సినిమాకి అటు క్లాస్ లుక్..ఇటు మాస్ ఇమేజ్ రెండింటిని తీసుకొచ్చాడు. మహేశ్ నోటి నుండి వచ్చే ప్రతి మాస్ డైలాగ్ బాగా పేలింది.

సినిమా లో కామెడీ కి పెద్ద పీఠ వేశాడు డైరెక్టర్. ముఖ్యంగా మహేశ్, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్ మధ్య వచ్చే సీన్స్ సూపర్ గా ఉంటాయి. హ్యాపీ గా నవ్వుకోవచ్చు. చాలా రోజుల తరువాత మహేశ్ ని మళ్ళీ మనం ఓ పండు గాడిలా చూడచ్చు. మహేశ్ కీర్తి లవ్ ట్రాక్ అద్దిరిపోద్ది. కళావతి కి విలన్ కి సంబంధం లో అమంచి ట్వీస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. ఇక సినిమా కి మెయిన్ ప్లస్ పాయింట్ తమన్ మ్యూజిక్.. ఏం కొట్టాడు డ్రమ్‌స్.. మహేశ్ ఎంట్రీకి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వింటే..గూస్ బంప్స్ రావాల్సిందే.. అంత బాగా సెట్ అయ్యింది మ్యూజిక్. ఇక పాటలు కూడా ఒకదానికి మించి మరోకటి ఉంది. కానీ అన్నీ సాంగ్స్ లోకి హైలెట్ కళావతి సాంగే. క్లాస్ కూల్ స్టెప్పులతో మహేశ్, కీర్తి హెల్తీ రొమాన్స్ బాగుంటుంది.

ఇక ఇంటర్వెల్ ట్వీస్ట్ మైండ్ బ్లాకింగ్ గా ఉంటుంది. అస్సలు ఎవ్వరు ఊహించని విధంగా సెట్ చేశాడు డైరెక్టర్. ఇక రామ్ లక్ష్మణ్ ఫైట్ సీన్లు సినిమాని మరో మెట్టు ఎక్కిస్తాయి. కధ కొంచెం సాగదీసినా..మధ్య మధ్యలో కామెడీతో నెట్టుకొచ్చారు పరశూరామ్. ఓవర్ ఆల్ గా సినిమా గురించి ఒక్క లైన్లో చెప్పాలంటే యాక్షన్ రీవేంజ్ డ్రామ. మనం తెర పై ఇలాంటి కధలు చాలా చూశాం..కానీ ఆ ఫీలింగ్ రాకుండా తన మ్యాజిక్ చూయించాడు పరశూరామ్. అంటే..పాత చింతకాయ పచ్చడే.. కానీ కొత్త కంచం లో వడ్డించారు అంతే. జనాలు సినిమాకి వెళ్లేది ఎంటర్ టైన్ మెంట్ కోసం.. ఆ విషయంలో సినిమా సూపర్ హిట్టే అని చెప్పవచ్చు.