బాలయ్య బ్లాక్ బస్టర్ ‘ నరసింహనాయుడు ‘ సంచలన నిజాలు..!

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన నరసింహ నాయుడు చిత్రం గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. బాలకృష్ణ ఈ సినిమాలో ఒక విభిన్నమైన కథతో ప్రేక్షకులను బాగా అలరించారు. ఇక ఈ చిత్రం 2001వ సంవత్సరంలో విడుదలై పెను సంచలనంగా మారింది. ఇక అంతే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ విజయాన్ని సొంతం చేసి రికార్డు సృష్టించింది.. ఇక ఈ సినిమా రికార్డుల విషయం గురించి కూడా ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

ఈ చిత్రం 21 ఏళ్ల క్రితం గా విడుదలై తెలుగులో రూ.21.81 కోట్ల రూపాయలను సాధించిన మొదటి చిత్రంగా రికార్డు ఎక్కింది. ఈ సినిమా మొత్తం మీద రూ. 30 కోట్ల రూపాయలు వసూలు రాబట్టింది. నరసింహ నాయుడు చిత్రం తెలుగులో తొలిసారిగా వందకుపైగా 105 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇక బాలకృష్ణ సరసన హీరోయిన్ గా సిమ్రాన్, ప్రీతి జింగానియా, ఆషా షైనీ కథానాయకులుగా నటించారు.

ఇక అంతే కాకుండా ఈ చిత్రంలోని పాటలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. సమరసింహారెడ్డి తర్వాత బాలకృష్ణ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్లో ఈ చిత్రం కూడా సమరసింహా రెడ్డి లాగానే ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక బాలయ్య – బి.గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన 4వ చిత్రం ఇది. ఈ సినిమా చాలాచోట్ల సరికొత్త రికార్డులను కూడా క్రియేట్ చేసింది. 2001వ సంవత్సరంలో సంక్రాంతి బరిలో ఈ సినిమాకి పోటీగా విడుదలైన మృగరాజు సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. ఇక వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు సినిమా కూడా ఈ చిత్ర బరిలో నిలకడగా నరసింహనాయుడు సినిమా నే విజేతగా నిలిచింది.

ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం ఎంతో అద్భుతంగా అందించారు. మాటలు పరుచూరి బ్రదర్స్ రాయడం వల్ల ఈ సినిమాలోని మాటలు హైలెట్ గా నిలిచాయి. బాలయ్య డైలాగ్ సినీ ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిచాయి. బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు చిత్రం 19 కేంద్రాలలో 175 రోజులు ఆడి రికార్డు సృష్టించగా ఆ తర్వాత తెలుగులో ఇంద్ర, సింహాద్రి, పోకిరి, మగధీర తదితర సినిమాలు ఇండస్ట్రీ హిట్ గా నిలబడ్డాయి.