ప్రతి అమ్మ ఇలాగే ఆలోచిస్తే..గూస్ బంప్స్ తెప్పిస్తున్న ” మేజర్ ” ట్రైలర్..!!

మల్టీ టాలెంటెడ్ యంగ్ హీరో అడవి శేష్ హీరో గా నటిస్తున్న చిత్రం “మేజర్”. కెరీర్ బిగినింగ్ నుంచి డిఫరెంట్ గా ఆలోచిస్తూ..అలాంటి కధలనే ఎంచుకుంటూ వస్తున్న అడవి శేష్. నటనకు ఇంపార్ టెన్స్ ఉన్న పాత్రలే చేయడానికి ఇష్టపడుతాదు. ఈ క్రమంలోనే మేజర్ సినిమా సెలక్ట్ చేసుకున్నాదు. ఈ సినిమా అనౌన్స్ చేసిన్నప్పటి నుండి రిలీజ్ అయిన ప్రతి అప్ డేట్ సినిమా పై భారీ అంచనాలను పెట్టుకునే చేసింది. ఇక కొద్ది సేపటి క్రితమే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే.. గూస్ బంప్స్ వస్తున్నాయి. అంత కనెక్ట్ అయిపోతాం మనం సినిమాకి.

అడవి శేష్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియా మూవీ కావడంటొ మేజర్ పై భారీ అంచనాలే ఉనాయి. ఆ ఎక్స్ పెక్ టేషన్స్ ని ఏ మాత్రం నిరాశ పరచకుండా ఉంటుంది సినిమా అని టరిలర్ ని చూస్తేనే తెలిసిపోతుంది. శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం జూన్ 3న విడుదల చేయడానికి గట్టిగా ప్లాన్ చేస్తునారు మేకర్స్. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ లో భాగంగా..‘మేజర్’ సినిమా ట్రైలర్ ని రిలీజ్ చేసారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.

ఈ సినిమా ట్రైలర్ ను తెలుగులో మహేష్ బాబు, హీందీలో హిందీలో సల్మాన్ ఖాన్, మళయాలంలో పృథ్వీరాజ్ గ్రాండ్ గా కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే అడివి శేష్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కన్ ఫామ్ అని తెలుస్తుంది. అడవి శేష్..”ప్రతి అమ్మ ఇలాగే ఆలోచిస్తుంది” అంటూ చెప్పే డైలాగ్ కి మనం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాం. ముఖ్యంగా ఈ సినిమా ప్రతి ఇండియన్ ని ఆలోచింప జేస్తుంది అని అర్ధమౌతుంది. సినిమాలో ప్రకాష్ రాజ్ పాత్ర హైలెట్ అవుతుందని తెలుస్తుంది. అడవి శేష్ ను ఉద్దేశిస్తూ..” వాడు మంచి కొడుగ్గా ఉండటం కన్నా, మంచి భర్తగా ఉండటం కన్నా కూడా .. వాడు ఒక ఇండియన్ సోల్జర్‌గా ఉండటానికి ఇష్టపడ్డాడు”.. అంటూ ప్రకాష్ రాజ్ ఎమోషనల్ గా చెప్పే డైలాగ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా మెయిన్ ప్లస్ పాయింట్ యాక్షన్ సీక్వెన్స్‌లు అని అంటున్నరు సినీ ప్రముఖులు. ఈ సినిమాకు విజువల్స్ ఎఫెక్ట్స్ ఓ రేంజ్ లో సెట్ చేశారు..సినిమా కి అవే హైలెట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. ఓవర్ ఆల్ గా నేటి సమా జానికి ఈ మేజర్ సినిమా చాలా అవసరం అని చెప్పవచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సినిమాలో వార్, యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ ,రొమాన్స్ అన్ని కలగలిసి ఉండే సినిమా. ఖచ్చితంగా అడవి శేష్ ఈ సినిమాతో హిట్ కొతాడు అంటున్నారు సినీ విశ్లేషకులు.