దీన్‌త‌ల్లి తెల్లారేస‌రికి అయిపోవాల్సిందే..ట్రిపుల్ ఎంటర్టైన‌మెంట్‌తో ‘ఎఫ్‌-3’ ట్రైల‌ర్‌..

వావ్ ..సూపర్బ్..అద్దిరిపోయింది..ఈసారి డబుల్ కాదు ట్రిపుల్ ఎంటర్ టైన్ మెంట్ పక్కా..అంటూ కామెంట్స్ చేస్తున్నారు F3 ట్రైలర్ చూసిన జనాలు. కొద్ది సేపటి క్రితమే రిలీజ్ అయిన F3 ట్రైలర్ ..ఓ రేంజ్ లో దూసుకుపోతుంది. ఎక్కడ నెగిటీవ్స్ లేకుండా..ఫుల్ నవ్విస్తూ.. కామెడీ కే పెద్ద పీఠ వేస్తూ..డైరెక్టర్ అనీల్ రావిపూడి..మరోసారి తన మార్క్ ను చూయించాడు. ఇద్దరు బడా హీరోలు వెంకటేష్-వరుణ్ తేజ్ కలిసి బిగ్గెస్ట్ ఫ్యామిలీ మల్టీస్టారర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మే 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే దాదాపు 95శాతం సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న F3 చిత్రం..మరి కొద్ది రోజుల్లోనే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయబోతుందట.

F2 సినిమాకి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా పై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకుని ఉన్నారు. ఈ క్ర‌మంలో ఫస్ట్ పార్ట్ కంటే సీక్వెల్ మరింత భారీ విజ‌యం సాధిస్తుంద‌ని ‘ఎఫ్‌-3’ బృందం గ‌ట్టి న‌మ్మ‌కంతో ఉన్నార‌ట‌. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్ ఎక్స్ పోజింగ్ విషయంలో ఏ మాత్రం కాంప్రమైజ్ కాకుండా..ఫుల్ దంచికొట్టేశారు అని ట్రైలర్ చూస్తుంటేనే అర్ధమవుతుంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన అన్ని పాట‌లు,లుక్స్ ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ను మేక‌ర్స్ కొద్ది సేపటి క్రితమే విడుద‌ల చేశారు.

ట్రైలర్ విషయానికి వస్తే..చించి చించి అదరకొట్టేశారు వరుణ్-వెంకీ. ఆడవాళ్లకు ఉన్న బంగారం పిచ్చిని..సమాజంలో ఉన్న డబ్బు పిచ్చిని కామెడి విధంగా తెరకెక్కించి ఫుల్ ఫన్ జెనరేట్ చేశాడు అనిల్. దేవి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా లేనప్పటికి..మాస్ పంచ్ డైలాగ్ లతో అనిల్ నెట్టుకొచ్చారు. ట్రైలర్ లో ప్రగతి..”దీన్‌త‌ల్లి తెల్లారేస‌రికి ఈ పాతిక లక్షలు యాభై..అయిపోవాల్సిందే” ..టూ చెప్పే డైలాగ్ బాగా హైలెట్ అయ్యింది. అంతేకాదు ..వెంకీ వచ్చి..”వాళ్ళది మరాఠి ఫ్యామిలీ అయితే మాది దగ్గుబాటి ఫ్యామిలి “అని చెప్పడం..వరుణ్ ఏమో “వాళ్ళది దహా ఫ్యామిలీ అయితే మాది మెగా ఫ్యామిలీ “అని చెప్పడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. ఇక ఫైనల్ ట్వీస్ట్..”అంతేగా అంతేగా” అంటూ..అనిల్ మరోసారి బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమైపోయాడు .