దయచేసి ఇలాంటివి అడగకండి..యాంకరమ్మ కు ఇచ్చిపడేసిన మహేశ్..

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు నటించిన చిత్రం సర్కారు వారి పాట. డైనమిక్ డైరెక్టర్ పరశూరామ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మే 12 న గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సంధర్భంగా చిత్ర బృందం ప్రమోషన్స్ ను స్పీడ్ అప్ చేస్తున్నారు. ఇన్నాళ్లు పరశూరామ్, హీరోయిన్ కీర్తి సురేష్ సినిమా ను ప్రమోట్ చేయగా..రీసెంట్ గా మహేశ్ కూడా ప్రమోషన్స్ లో జాయిన్ అయిపోయాడు . ఓ ప్రముఖ పత్రికా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యుల్లో..మహేశ్, డైరెక్టర్ పరశూరామ్ పాల్గొన్నారు.

యాంకర్ గా వచ్చిన సుమ కనకాల..మంచి టైమింగ్ తో రైమింగ్ తో ఫుల్ ఫన్ క్రియేట్ చేసింది. సినిమాకి సంబంధించిన చాలా విషయాల గురించి సరదాగా ముచ్చటించిన మహేశ్ కు ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న వేసింది సుమ. దీంతో మహేశ్ కూల్ గానే నవ్వుతూ ఇచ్చిపడేశాడు. సుమ అడుగుతూ..” సినిమాలో సితార ఓ సాంగ్ చేసింది. చాలా బాగా చేసింది. ఈ ఐడియా ఎవరిది” అని అడగ్గా..మహేశ్ రిప్లై ఇస్తూ..” ఈ ఐడియా తమన్ ది. అతనే నాకు ఈ ఐడియా ఇచ్చాడు .. నేను షూటింగ్ కంప్లీట్ చేసుకుని..బయటకు వచ్చే సరికి..ఈ విషయాని నమ్రతకు చెప్పేసి.. ఆమె పర్మీషన్ తీసుకుని..సితార కూడా ఓకే అనేసి..అంతా మూడు నాలుగు రోజుల్లో చక చకా షూటింగ్ కూడా చేసేశారు”..అంటూ చెప్పుకొచ్చారు.

సినిమాలో సితార క్లిప్స్ కనీసం లాస్ట్ ఎండ్ కార్డ్స్ లో నైనా చూయించచు కదా అని సుమ అడగ్గా.. మహేశ్..స్పాంటేనియస్ గా రిప్లై ఇస్తూ..” మీరు ఇలాంటివి అడగకండి. అసలే నేను సినిమాలో ఎందుకు లేను డాడీ అంటూ అడుగుతుంది. ఇప్పుడు ఇది తెలిస్తే అలాగే చేయండి అంటూ వదలదు. అయినా సినిమా ప్రింట్స్ అమెరికా వెళ్లిపోయాయి.”అంటూ చెప్పిన మహేశ్..లాస్ట్ లో ” నేను సితారని చూసి గర్వ పడుతున్నా..చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. కచ్చితంగా ఫ్యూచర్ లో పెద్ద హీరోయిన్ అవుతుంది “అంటూ చెప్పుకొచ్చారు. దీని బట్టి సితార ని హీరోయిన్ చేయాలని ముందుగానె ఫిక్స్ అయ్యిన్నట్లు ఉన్నాడు మహేశ్ అని తెలుస్తుంది. ఇక సర్కారు వారి పాట తరువాత మహేశ్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఓ సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే.