బాల‌య్య – రాధ – చిరంజీవి ఈ ముగ్గురిలో కామ‌న్ పాయింట్‌.. న‌మ్మ‌లేని నిజం.!

చిరంజీవి – బాల‌య్య – రాధ.. ఈ ముగ్గురి పరిచయం అక్కర్లేదు. 90sలో దుమ్ముదులిపిన జంట వీరు. అప్పడినుండి ఈ నాటికి హీరోలుగా కొనసాగుతూ అంటే స్టార్ డమ్ ని నేటికీ కొనసాగుతూ ఉందంటే వారి స్టామినా గురించి వేరే చెప్పుకోవలసిన పని లేదు. చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన రాధ గురించి కూడా చెప్పనవసరం లేదు.

ముఖ్యంగా డాన్సులు విషయంలో ఎప్పుడు కూడా వీరి ముగ్గురి మధ్య చాలా పోటీ నడుస్తుండేది. అలాగే చాలా విషయాలు వీరి ముగ్గురి మధ్య కామన్ గా జరిగాయి. ఇక అది యాదృచ్ఛికమో, ఏమో గానీ ఇక్కడ కొన్ని ఆసక్తికర విషయాలగురించి ఒకసారి చూద్దాము.

వారి మధ్య జరిగిన కామన్ పాయింట్స్:
వారి కెరీర్ ఇంచుమించుగా ఒకసారే స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. చిరంజీవి తన స్వయం శక్తితోనే మెగాస్టార్ గా ఎదిగిన తీరు చాలామందికి ఆచరణీయం. మొదట విలన్ వేషాలతో ఎంట్రీ ఇచ్చిన చిరు తరువాత కాలంలో అంచెలంచెలుగా ఎదిగి అగ్ర హీరో స్థాయికి చేరుకున్నాడు. అలాగే బాలయ్య మొదట బాలనటుడిగా రంగప్రవేశం చేసి, తండ్రి NTR వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని సాహసమే జీవితం చిత్రంతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి, అగ్ర హీరో అయిన తీరుని కొనియాడకుండా ఉండలేము.

ఇక వీరిద్దరి సినిమాల్లో కథానాయికగా నటించిన అందాల భామ హీరోయిన్ రాధ బేసిగ్గా మలయాళీ అయినా, తెలుగులో తనకంటూ ఓ ఇమేజ్ తెచ్చుకుంది. ఇక ఈ ముగ్గురికి ఉన్న కామ‌న్ పాయింట్ ఏంటంటే వీరికి ఇద్ద‌రేసి అమ్మాయిలు.. ఒక అబ్బాయి ఉన్నారు. చిరు ఇద్ద‌రు కుమార్తెలు కాగా.. చెర్రీ హీరో. బాల‌య్య‌కు ఇద్ద‌రు అమ్మాయిలు బ్రాహ్మ‌ణి, తేజ‌స్విని కాగా మోక్ష‌జ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వ‌నున్నాడు. రాధ‌కు కుమారుడుతో పాటు ఇద్ద‌రు కుమార్తెలు తుల‌సి, కార్తీక హీరోయిన్లుగా చేశారు.

ముగ్గురి కలయికలో సినిమాలు:
ఇక వీరి ముగ్గురి కలయికలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి. చిరుతో గుండా, దొంగ, అడవి దొంగ, కొండవీటి రాజా, కొండవీటి దొంగ, రాక్షసుడు, స్టేట్ రౌడీ, కొదమ సింహం వంటి చిత్రాల్లో రాధ నటించి మెప్పించింది. అలాగే బాలయ్యతో రాముడు భీముడు, ముద్దుల కృష్ణయ్య, రక్తాభిషేకం, దొంగరాముడు ఇంకా అనేక హిట్ చిత్రాలలో రాధ బాలయ్యకు ధీటుగా నటించింది.

ఇక వారి పక్కన డాన్స్ చేయడానికి ఇతర హీరోయిన్స్ వణికే రోజులలో వారికి ధీటుగా రాధ ఒక్కటే భయపడకుండా డాన్సులు వేసేది. వారి ప్రయాణం నేటికీ కొనసాగడం ఎంతో ఆనందదాయకం. ఎందరు హీరోలొచ్చినా వీరి స్టార్ డమ్ చెక్కుచెదరలేదు.