బాల‌య్య – రాఘవేంద్రుడి కాంబినేష‌న్లో ఎన్ని సినిమాలు.. తేడా ఎక్క‌డ కొట్టింది..!

దర్శకుడు రాఘవేంద్ర గురించి అందరికీ తెలిసినదే. దాదాపు ఓ ఒకటి అరా మినహా ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే అని టాలీవుడ్లో ఒక నానుడి వుంది. అలాంటి రాఘవేంద్ర మన బాలయ్యకు మాత్రం ఒక్కటంటే ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయాడట. ఏమిటి ఆశ్చర్యపోతున్నారా! ఇది నిజమే. మొట్ట మొదటగా వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా ‘రౌడీ రాముడు కొంటె కృష్ణుడు’ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందట. ఈ సినిమాలో అన్నగారు నందమూరి తారక రామారావు కూడా నటించారట.

వారి కలయికలో వచ్చిన సినిమాలు:
ఇక ఆ తర్వాత వీరి కలయికలో బాలకృష్ణ సోలో హీరోగా వచ్చిన, ‘పట్టాభిషేకం’ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఆ తర్వాత కె.రాఘవేంద్రరావు సోదరుడు కె.కృష్ణ మోహన్ రావు నిర్మాణం, కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘అపూర్వ సహోదరులు’ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేకపోయిందట దాని తరువాత వీరి కలయికలో ‘సాహస సామ్రాట్’ చిత్రం విడుదలై, దారుణ పరాజయం పాలయ్యింది. ఈ క్రమంలో వచ్చిన ‘దొంగ రాముడు’ చిత్రం కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దాంతో నిర్మాతలు బాలకృష్ణ రాఘవేంద్రరావు కాంబినేషన్లో సినిమా అంటే భయపడే పరిస్థితి వచ్చిందట.

వీరి కలయికలో హిట్లు లేవా ?
అన్ని సినిమాల తరువాత వారి కలయికలో చాలాకాలంపాటు సినిమాలు రాలేదు. కానీ కొన్నాళ్ల తరువాత భారీ చిత్రాల నిర్మాత అశ్వినీదత్ ఆ సెంటిమెంట్ ని పక్కని పెట్టి రాఘవేంద్రరావు, బాలకృష్ణ కలయికలో ఒక సినిమా చేసారు. దానిపేరు ‘అశ్వమేధం’. 1992లో బాలకృష్ణ, నగ్మా, మీనా హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది.

ఇక దానితరువాత అంటే దాదాపు 15 సంవత్సరాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో చిట్ట చివరి చిత్రంగా ‘పాండురంగడు’ 2008 లో వచ్చింది. ఈ సినిమా భక్తిరస చిత్రమైనప్పటికి ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇలా రాఘవేంద్రరావు, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడం పరిపాటిగా మారిపోయింది.