టాలీవుడ్‌లో చిరంజీవిని ఎవరు మోసం చేశారో తెలుసా…?

తెలుగు ప్రజలకు సుపరిచితుడు పెద్దగా పరిచయం కూడా అవసరం లేని మనిషి మన మెగాస్టార్ చిరంజీవి. ఈయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ అయితే సినీ అరంగేట్రం చేసిన కొత్తల్లో ఈ పేరు చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద పేరుతో పిలవటం చాలా కష్టం అనే సరికి అయన తన పేరుని చిరంజీవిగా మార్చుకోవటం జరిగింది. అయితే అయన తన పేరును చిరంజీవిగా మార్చుకున్నాకనే ఆయనకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు . చిరంజీవి గారు తెలుగులో దాదాపు 150 సినిమాలకు పైగానే నటించారు. అంతేకాదు ఈయన తమిళ, కన్నడ, హిందీ భాషలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించాడు.

అందుకే ఈయనను అప్పట్లో ఇండియా టుడే పత్రికల వాళ్ళు బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ తో పోలుస్తూ బిగ్గర్ డాన్ బచ్చన్ అనే శీర్షికలు ప్రచురించారు. చిరంజీవి నటజీవితం మాత్రం 1978లో వచ్చిన పునాదిరాళ్ళు అనే చిత్రం తోనే ప్రారంభమైంది. కాకపోతే దీనికంటే ముందు ప్రాణం ఖరీదు అనే సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అప్పట్లో అత్యధిక పారితోషకం తీసుకున్న హీరోలలో ఈయన ఒకడు. అంతేకాదు ఈయనకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో 1992లో నటించిన ఘరానా మొగుడు సినిమా అయితే ఏకంగా 10 కోట్లకు పైగా వసూళ్ళు సాధించి అప్పట్లో తొలి తెలుగు చలన చిత్రంగా నిలిచింది.

ఇంతటి ఘన విజయం ఉన్న ఈయనకి కూడా మొదట్లో హీరో వేషం ఇస్తాను అని చెప్పి మోసం చేసిన వాళ్ళు లేకపోలేదు. ఈయన అప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేవాడు. అలాంటి ఒక సంఘటన గురుంచే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అభద్రతా భావం కెరీర్ ఏమై పోతున్న అన్న భయం ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సినిమా స్టార్స్ కు ఇందులో మినహాయింపు ఏం ఉండదు. ఎందుకంటే ప్రతి శుక్రవారం కాంపిటేషన్ వల్ల ఒక వారం హిట్ మరో వారం ప్లాప్ ,ఇలా ఒక చక్రంలా తిరిగే హీరోల జీవితంలో కూడా ఈ అభద్రతాభావం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వారు కెరీర్ లో ఎదుగుతున్న దశలో ఈ భయం ఎక్కువగా ఉంటుంది.

సినిమా అనేది ఒక కలల ప్రపంచం దీనిని అద్భుతంగా చూపించి క్యాష్ చేసుకుంటుంటారు సినీ పెద్దలు. ఇలాంటి ఎన్నో విషయాలను విన్న అయన తన కెరీర్ ను ఏంటో జాగ్రత్తగా ప్రారంభించారు. సినిమా ఛాన్స్ లభించక నిరాశ నిస్పృహ కలిగిన ఎంతో మంది పాండి బజార్ లో ఉంటారు. అంటే కాదు అటువైపు వెళ్లిన వారితో మాట్లాడిన తనకి అలాంటి ఆలోచనే వస్తుందని ,కిళ్ళీ ,సిగరెట్ వంటివి తాగినా చెడు అలవాటు కిందకి వస్తుందని వాటి జోలికి కూడా వెళ్లేవాడు కాదు. నటుడిగా ఎదగాలి అంటే నటనతో పాటు ప్రవర్తన కూడా ముఖ్యం అది తెలుసుకుని పెద్దవాళ్ళ పట్ల గౌరంగా ఉండేవాడు. పారితోషకం గురించి కూడా ఆలోచించే వాడు కాదు యెంత ఇస్తే అంత తీసుకుని సైలెంట్ గా వెళ్లిపోయేవాడు.

ఇలా ఉండగా ఒక రోజు సత్య చిత్ర పరిశ్రమ నుండి ఒకసారి ఆఫీస్ కి రమ్మని ఫోన్ వచ్చింది. ఆ పరిశ్రమ అడవిరాముడు వంటి గొప్పచిత్రాన్ని తీసిన సంస్థ కనుక పెద్ద అవకాశం వస్తుందో ఏమో అన్న ఆశతో వెళ్ళాడు. అయితే ఆ సంస్థ అధినేతలలో ఒకరైన సూర్య నారాయణ హీరో కృష్ణతో కొత్త అల్లుడు అనే సినిమా తీస్తున్నామని అయితే అందులో విలన్ క్యారక్టర్ ఒకటి వెయ్యాలని చిరంజీవితో అన్నారు. అంతేకాదు ఆ సినిమాలో కైకాల సత్యనారాయణ మెయిన్ విలన్ అని కుడా చెప్పారు.

అయితే అప్పటికే కొన్ని సినిమాలు చేస్తున్న చిరంజీవి చాలా మొహమాటంగా అబ్బే ఇప్పుడు విలన్ వేశాలు వేయటం లేదు అండి అని చెప్పారు. అయినా సూర్య నారాయణ వినిపించుకోకుండా చాలా టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ మీరు మీరు ఇలాంటి వేషాలు వేయకుంటే ఎలా హిందీలో శత్రుజ్ఞ సిన్హా చేయటం లేదా అయినా త్వరలో హీరో గా పెట్టి వేరే సినిమా తీయాలి అనుకుంటున్నాము అని చెప్పి మొత్తానికి చిరంజీవిని ఒప్పించారు. దీనితో అప్పటికే హీరోగా పెట్టి చేస్తున్న నిర్మాతలు అంతా చిరంజీవిని ఇలా సైడ్ క్యారక్టర్ చేస్తే మా సినిమాల పరిస్థితి ఏంటి అవి ఎవరు చూస్తారు అన్నా కూడా వినకుండా విలన్ క్యారక్టర్ చేసారు. అయితే వాళ్ళు తనకి హీరో పాత్ర ఇవ్వకుండా సాగతీసారే తప్ప హీరో క్యారక్టర్ ఇవ్వనే లేదు.

ఎదురు తిరిగి అడిగితే వాళ్ళది పెద్ద సంస్థ రాఘవేంద్ర రావు వంటి వాళ్ళతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళకి నా మీద చెడుగా చెబుతారేమో అనే ఆలోచలనో సైలెంట్గా ఇచ్చిన క్యారక్టర్ చేసుకుంటూ పోయేవాడు. అంటే తప్ప సూర్య నారాయణ చేసిన మోసాన్ని ఎక్కడ చెప్పలేదు ఇలా చిరంజీవి గారితో చాలా మందే సొమ్ము చేసుకున్నారు. ఇలాంటి కొన్ని సంఘటనల తరువాత చిరంజీవి తన అభద్రతా భావాన్ని వీడి ఎన్నో కష్టాల తరువాత ఇంతటి స్థాయికి ఎదిగారు అని చెప్పవచ్చు.