మొదట హీరోయిన్.. కొరియోగ్రాఫర్.. ఇప్పుడు పాలిటిక్స్‌లో ఉంది.. ఎవ‌రో తెలుసా…!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు ఎంతో మంచి కలెక్షన్ ఉంది. సినిమాలలో బాగా రాణించిన వారు ఇక ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారు ఇక అటు తర్వాత రాజకీయాల్లోకి వెళ్లడం ఇక రాజకీయాల్లో కూడా రాణించడం చేశారు. ఇప్పటి వరకు ఎంతోమంది హీరో హీరోయిన్ లు ఇలా సినిమాల నుంచి రాజకీయాల్లోకి వెళ్లి సత్తాచాటిన వారు ఉన్నారు.

ఇక అలాంటి వారిలో గాయత్రి రఘురాం కూడా ఒకరు ఇక అసలైన అందానికి ప్రతిరూపమైన ఈ హీరోయిన్ ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇక బహుముఖ ప్రజ్ఞాశాలి అన్న పదానికి ఈ అమ్మడు బాగా సరిపోతుంది. చెన్నైకి చెందిన ఈ బ్యూటీ 2002లో ప్రభుదేవా హీరో గా నటించిన చార్లీచాప్లిన్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. తర్వాత మా బాపు బొమ్మకు పెళ్ళంట అనే సినిమాలో నటించింది.

అయితే ఎక్కువగా తమిళంలో అవకాశాలు రావడంతో కోలీవుడ్ ఇండస్ట్రీ పరిమితమైంది.మొత్తంగా 14 సినిమాల వరకూ చేసింది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను గాయత్రి రఘురాం తండ్రి తాత కూడా ఇండస్ట్రీతో పరిచయం ఉన్నవారే. ఇక గాయత్రి రఘురాం టాలీవుడ్ లో మోస్ట్ పాపులర్ కొరియోగ్రాఫర్ గా 1,400 సినిమాలకు పైగా పని చేశారు. 1990లలో దర్శకునిగా నిరూపించుకున్నారు. సినిమాలో హీరోయిన్ గా ఉన్న సమయంలోనే దీపక్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది గాయత్రి. కానీ ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో విడాకులు ఇచ్చింది. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉంది.

అయితే ఆ తర్వాత హీరోయిన్ గా కాకుండా కొరియోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా కొనసాగుతున్న సమయంలోనే 2014లో అమిత్ షా ఆధ్వర్యంలో బిజెపిలో చేరి ఇక బిజెపిలో క్రియాశీలక నేత గా వ్యవహరించారు. ఒకవైపు రాజకీయాల్లో కొనసాగుతూనె ఇండస్ట్రీలోకి వచ్చి దర్శకురాలిగా కూడా మారి సినిమా తెరకెక్కిస్తోంది గాయత్రి రఘురాం. ఇలా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి కొరియోగ్రాఫర్ గా మారి ఆ తర్వాత పాలిటిక్స్ లోకి వెళ్లి మళ్లీ ఇండస్ట్రీలో దర్శకురాలిగా రాణించాలని ప్రయత్నిస్తోంది అందాల ముద్దుగుమ్మ గాయత్రి.