OTTలో “రాధే శ్యామ్” విడుదల..నిరాశలో ఫ్యాన్స్..!!

“రాధే శ్యామ్”..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరో గా..అందాల తార పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన చిత్రం. ఎన్నో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొట్టింది. దాదాపు 100 కోట్ల నష్టం వచ్చిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ప్రభాస్ కెరీర్ లో ఇలాంటి ఫ్లాప్ చిత్రం లేదంటూ నెటిజన్స్ ఆయన ను ట్రోల్ చేస్తున్నారు. సినిమా కి మెయిన్ మైనస్ పాయింట్ కధ లేకపోవడం. బిగ్గెస్ట్ డిజాస్టర్ ఏమిటంటే..ఆ స్టోరీ లేని లైన్ ను ప్రభాస్ చూస్ చేసుకోవటం.

నిజానికి ఈ సినిమా షూటింగ్ ప్రరంభం అయిన మొదలు..మీడియాలో ఫ్యాన్స్ హంగామా అంత ఇంతా కాదు. ఓ రేంజ్ లో ఎక్స్ పెక్ట్ చేశారు. కోట్లు ఖర్చు చేసి సెట్లు, విదేశాలకు వెళ్లి పాటలు షూటింగ్ లో వామ్మో ఆ పబ్లిసిటీ చూసి అందరు ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రను తిరగరాసేస్తుంది అనుకున్నారు. సీన్ కట్ చేస్తే..బాక్స్ ఆఫిస్ వాద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అంతేకాదు దాదాపు 100కోట్లు లాస్ అయ్యి..ఇండియన్ సినిమా చరిత్రలో కని విని ఎరుగని ఫ్లాప్ రికార్డ్ ను సొంతం చేసుకుంది. దీంతో ఫ్యాన్స్ చాలా బాధ పడ్డారు..ఏదో ఊహించుకుంటే మరేదో జరిగింది అంటూ సినిమా డైరెక్టర్ రాధ కృష్ణ ని తిట్టిపోశారు.

కాగా, రీసెంట్ గా ఈ సినిమా OTT లో రిలీజ్ అవుతుందని తెలిసి మరింత నిరాశ పదుతున్నారు. సినిమా రిలీజైన ఇంత త్వరగానే OTT లోకి వస్తుందంటే సినిమా ఎంత డిజాస్టర్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు. ధియేటర్స్ లో అట్టర్ ఫ్లాప్ అయిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని అమెజాన్‌ అధికారికంగా తెలిపింది. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి అమెజాన్‌ లో స్ట్రీమింగ్‌ కానుందని తెలియజేస్తూ సరికొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది. వెండి తెర పై నిరాశ పరిచిన “రాధే శ్యామ్”..కనీసం OTT లోనైనా మెప్పిస్తే బాగుండు అంటూ అభిమానులు ఆశపడుతున్నారు. కానీ మళ్ళీ వాళ్లకి నిరాశ తప్పదనే అంటున్నారు సినీ విశ్లేషకులు. తెరపై ప్రభాస్‌-పూజా హెగ్డేల కెమెస్ట్రీ, పాటలు, విజువల్‌ ఎఫెక్ట్స్‌ సినిమాకు ప్రధాన బలంగా నిలిచినా..కధ లేకపోవదం సినిమా కు మైనస్ అయ్యింది.