ప్రేక్షకులకు షాక్.. మూడు రోజుల్లో ఆర్ఆర్ఆర్‌ను ఎత్తేస్తున్నారట!

స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కోసం యావత్ సినీ ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూశారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర జక్కన్న తనదైన మార్క్ చూపిస్తాడని అందరూ అనుకున్నారు. వారు ఊహించినట్లుగానే ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తొలి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

ఇక ఈ సినిమా రానున్న రోజుల్లో మరింత దుమ్ములేపడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ సినిమాను ఇంకా చూడని ప్రేక్షకులు కూడా ఉండటంతో, వారికి ఇప్పుడు షాకిచ్చే న్యూస్ ఒకటి సోషల్ మీడియయాలో చక్కర్లు కొడుతోంది. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మరో మూడు రోజుల్లో థియేటర్ నుండి ఎత్తేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ సినిమాను థియేటర్ల నుండి ఎత్తేస్తున్నది ఇక్కడ కాదులెండీ. అమెరికాలోని థియేటర్లలో డాల్బీ విజన్, సినిమార్క్ XD థియేటర్లలో ఈ సినిమాను తొలివారం ప్రదర్శించేందుకు అక్కడి డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేశారు. తొలి వారం ముగిశాక ఈ సినిమా నార్మల్ ప్రింట్ మాత్రమే అక్కడ వేస్తారు. దీంతో మరో మూడు రోజులే ఈ సినిమా డాల్బీలో ప్లే చేస్తుండటంతో అక్కడి ప్రేక్షకులు ఈ సినిమా రియల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఆసక్తిగా ఉన్నారు. ఈ మూడు రోజుల్లో అక్కడ థియేటర్ అక్యుపెన్సీ పెరిగే ఛాన్స్ ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి ఓవర్సీస్‌లో ఈ మూడు రోజుల్లో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ఎంతమంది చూస్తారో చూడాలి.