RRR REVIEW: ఆ సీన్‌కు థియేటర్లో బాక్సులు బద్దలవ్వాల్సిందే..ఒట్టు..!

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ “రణం రౌద్రం రుధిరం”. టాలీవుడ్ స్టార్ హీరోలు చరణ్-తారక్ ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమాలో . దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో…సుమారు నాలుగేళ్ళు వందల మంది టెక్నీషియన్స్.. ఎంతో కష్టపడి రాజమౌళి తెరకెక్కించిన సినిమానే ఈ RRR. కొద్దిసేపటి క్రితమే ప్రపంచవ్యాప్తంగా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా..అభిమానుల అంచనాలను ట్రిపుల్ చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఓపెనింగ్ షాట్ ఓ ట్రైబల్ అమ్మాయిని బ్రిటీష్ వాళ్ళు బలవంతంగా లాకుని వెళ్తుంటారు. సీన్ కట్ చేస్తే.. మన చరణ్ ఎంట్రీ ఇస్తాడు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ గా చరణ్ ఇరగదీశాడు. ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేయడం. నిజాయితీగా ఉంటూనే న్యాయస్దానానికి కట్టుబడి ఉండటం .. అమాయకపు ప్రజల్ని బ్రిటీష్ రాక్షసుల నుండి కాపాడటం..రాజమౌళి ప్రతి షాట్ ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఈ సినిమాలో చరణ్ పేరు రామ రాజు. ఈ సినిమా చూసిన తరువాత మనం చరణ్ అని పిలవలేము రామ రాజు అనే పిలుస్తాం అంతా బాగా మనకు ఆ పాత్ర గుర్తుండిపోతుంది.

ఇక తారక్ విషయానికి వస్తే ..చించి.. చించి.. చించేశాడు మన యంగ్ టైగర్. అమాయకపు అక్తర్ పాత్రలో తారక్ కొంచెం సేపు నవ్విస్తాడు. ముఖ్యంగా జెన్ని ..అక్తర్ మధ్య వచ్చే సీన్స్ సినిమాను చూడటానికి వచ్చిన జనాలని కొంచెంసేపు నవ్వుకునేలా చేస్తాయి. ఇక ఆ తరువాత తారక్-చరణ్ నాటు నాటు పాట సినిమాకి మరో ప్లస్ గా నిలిచింది. ఇక ఈ సినిమా మొత్తంలో ఇంటర్వెల్ సీన్ హైలెట్ గా ఉందని అభిమానులు చెప్పుతున్నారు. సినిమా చూసిన తరువాత ట్వీట్లు చేస్తూ..ఇంటర్వెల్ సీన్‌కు థియేటర్లో బాక్సులు బద్దలవాల్సిందే ఖాయం..నన్ను నమ్మండి ..ఒట్టు… సినిమాలో ఊహించని ట్విస్టులెన్నో ఉన్నాయి. రామ్ చరణ్ మెప్పిస్తే ఎన్టీఆర్ మైమరపించాడు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.