RRR REVIEW: కంటతడిపెట్టిస్తున్న తారక్..హ్యాట్స్ఆఫ్ రాజమౌళి..!!

వచ్చేసింది..కొట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న సినిమా కొద్ది సేపటి క్రితమే అభిమానుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్-తారక్..లతో కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన మూవీ “RRR”. ధియేటర్లో టైటిల్ పడగానే అభిమానుల అరుపులతోనే సినిమా సగం హిట్ కొట్టింది. మెగా , నందమూరి అభిమానులు అంటూ తేడా లేకుండా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.

ఓపెనింగ్ షాట్ తోనే అభిమానులకి పిచ్చెక్కించాడు జక్కన్న. ఇద్దరు బడా హీరోలతో సినిమా తీసేటప్పుడు ఆ డైరెక్టర్ గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ ..ఇద్దరి హీరోలను సమానంగా చూయించాలి అనుకోవడం..ఆ విషయంలో రాజమౌళి సూపర్ సక్సెస్ అయ్యాడు..చరణ్ – తారక్ లని ఎక్కడా కూడా తగ్గకుండా అలా అని ఇద్దరిని మరీ దేవుడ్లుగా చూయించకుండా..వారి పాత్రల్లో లీనమైపోయేలా చూయించాడు జక్కన్న. మనం సినిమా చూస్తున్నంత సేపు..తెర పై చరణ్-తారక్ లని చూడము..తారక్ ని కొమరం భీం గా ..చరణ్ ని అల్లూరి సీతారామరాజుగా చూస్తుండిపోతాం.

అంత చక్కగా ఆ పాత్రలకు సెట్ అయ్యారు ఇద్దరు. ముఖ్యంగా సినిమాకి భారీ ప్లస్ గా నిలిచింది విజువల్ ఎఫెక్ట్స్. ఈ చిత్రం ఒక విజువల్ వండర్ లా అనిపిస్తుంది అంటూ సినిమా చూసిన జనాలు చెప్పుతున్నారు. ఈ సినిమా ఒక ఎమోషనల్ క్లాసిక్..అని..ఓ సీన్ లో తారక్ మనల్ని ఏడిపించేస్తారని..సినిమాలో తారక్ పర్ఫామెన్స్ బాగుందని..నెటిజన్స్ రివ్యూ ఇస్తున్నారు. టోటల్ గా చెప్పాలంటే ప్రతి ఇండియన్ కాలర్ ఎగరేసి ..ఇది మా ఇండియన్ సినిమా అని గర్వంగా చెప్పుకునే సినిమా ఇది అంటూ అభిమానులు రివ్యూ ఇస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ అందరిని అంత అబ్బుర పరుస్తోంది అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టేశాడు.