ఆర్ఆర్ఆర్ పబ్లిక్ పల్స్.. హిట్టా.. ఫట్టా..?

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు రావడంతో వేకువజాము నుండే థియేటర్ల వద్ద జనాల హడావిడి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కొన్ని ప్రాంతాల్లో స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలతో రచ్చ చేస్తోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై నెలకొన్న భారరీ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందని చిత్ర యూనిట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కలిసి చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాను తొలిరోజే చూసేందుకు జనం ఎగబడుతున్నారు.

అయితే ఇప్పటికే చూసినవారు ఈ సినిమా గురించి పూర్తిగా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తుండటంతో చిత్ర వర్గాల్లో సంతోషం కనిపిస్తుంది. ఈ సినిమా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లాగా ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ జోరుగా సాగుతోంది. ఇక ఈ సినిమాలో తారక్, చరణ్‌ల డెడ్లీ కాంబినేషన్‌లో వచ్చే సీన్స్ ఈ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్తున్నాయట. కాగా ఈ సినిమాకు ఇద్దరు హీరోలు కూడా ప్రాణం పెట్టి పనిచేశారని, వారితో జక్కన్న చేసిన ఈ సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని ప్రేక్షకులు అంటున్నారు.

ఓవరాల్‌గా పబ్లిక్ పల్స్‌ను బట్టి చూస్తే, ఆర్ఆర్ఆర్ మేనియా ఇప్పట్లో ఏమాత్రం తగ్గకపోగా, రాను రాను ఇది మరింత పెరిగిపోతుంది తెలుస్తోంది. సినిమాకు కామన్ ఆడియెన్స్ నుండి పాజిటివ్ టాక్ వస్తుండటం ఈ సినిమాకు మేజర్ బలం కానుంది. పబ్లిక్ మౌత్ టాక్ ఈ సినిమాకు వసూళ్ల వరదను తెచ్చిపెట్టడం ఖాయమని, ఆర్ఆర్ఆర్ కోసం చిత్ర యూనిట్ పడ్డ కష్టం ఈ విధంగా ఫలితాన్నివ్వనుందని సినిమా ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇక ఫైనల్‌గా ఈ సినిమా హిట్టా.. ఫట్టా అనే పోల్‌లో ఈ బొమ్మ బ్లాక్‌బస్టర్ హిట్టు అంటున్నారు తెలుగు ఆడియెన్స్.