త‌న వ‌ర‌స్ట్ సినిమా ఏంటో చెప్పిన రాజ‌మౌళి.. తార‌క్ ఫేస్ మాడిపోయిందిగా…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌` ప్ర‌మోష‌న్స్‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన ఈ చిత్రం 2020లోనే రావాల్సి ఉంది. కానీ ఎన్నోసార్లు వాయిదాలు పడి చివరాఖరకు మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ముస్తాబైంది. రిలీజ్‌కు మ‌రికొన్ని గంట‌లే ఉండ‌టంతో.. ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే కనిపిస్తుంది.

మ‌రోవైపు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో రాజ‌మౌళి ముంబై, ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, కర్ణాటక అంటూ దేశం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. ఇందులో భాగంగానే ఓ ఇంగ్లీష్ మీడియాకు ఇంట‌ర్వ్యూ ఇచ్చారు. అక్క‌డ రాజ‌మౌళికి.. `మీరు డైరెక్ట్ చేసిన చిత్రాల్లో మీకు అస్స‌ల న‌చ్చ‌ని సినిమా ఏది..? `అన్న ప్ర‌శ్న ఎదురైంది.

అందుకు ఆయ‌న బ‌దులిస్తూ.. నేను తెర‌కెక్కించిన చిత్రాల్లో `స్టూడెంట్ నెంబర్ వన్` న‌చ్చ‌దు. అది నా తొలి సినిమా. దర్శకుడిగా స్టార్టింగ్ సినిమా కావ‌డం వ‌ల్ల స‌రైన అవ‌గాహ‌న లేక సినిమాను అలా తీశాను` అంటూ చెప్పుకొచ్చాడు. రాజ‌మౌళి అన్స‌ర్‌తో పక్కనే ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా అవాక్కయ్యారు. మ‌నోడి ఫేస్ మాడిపోయింది. ఎందుకంటే ఎన్టీఆర్ కెరీర్ లో మొట్టమొదటి హిట్ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్.

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ చిత్రాన్ని సి. ఆశ్వనీదత్, కె. రాఘవేంద్రరావు క‌లిసి నిర్మించారు. ఇందులో గజాలా హీరోయిన్‌గా న‌టించింది. కొన్ని అనుకోని పరిస్థితుల కార‌ణంగా జైలు పాలైన హీరో లాయరైన తరువాత ఒక తప్పుడు కేసులో చిక్కుకున్న తన తండ్రిని ఎలా విడిపించడన్నదే ఈ చిత్ర కథాంశం.

2001 సెప్టెంబర్ 27న విడుద‌లైన ఈ సినిమా భారీ విజ‌యం సాధించింది. మ్యూజిక‌ల్‌గా కూడా ఈ సినిమా మంచి మార్కులు వేయించుకుంది. రూ. 80 ల‌క్ష‌ల‌తో నిర్మిస్తే.. విడుద‌ల త‌ర్వాత ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద ఏకంగా రూ. 12 కోట్ల షేర్‌ను వ‌సూల్ చేసి నిర్మాత‌ల‌కు, బ‌య‌ర్ల‌కు భారీ లాభాల‌ను తెచ్చిపెట్టింది.