అన్న‌దాత‌ల‌కు ‘ నోవా ‘ అండ‌.. కృషీవ‌లుడు ‘ ఏలూరి ‘ మ‌రో ముంద‌డుగు

ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ ఉన్న ప్ర‌భుత్వాలు.. సేంద్రియ సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నా యి. ఇక‌, ప్ర‌జ‌లు కూడా ర‌సాయ‌న వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల కంటే కూడా.. సేంద్రియ సాగు ఉత్ప‌త్తుల‌కు మొగ్గు చూపుతున్నారు. దీంతో సేంద్రియ వ్య‌వ‌సాయ‌మే మున్ముందు ప్ర‌ధానం కానుంది. ఈ నేప‌థ్యంలో ప‌రుచూరు టీడీపీ ఎమ్మెల్యే, నిత్య కృషీవ‌లుడిగా పేరు తెచ్చుకున్న ఏలూరి సాంబ‌శివ‌రావు… త‌న నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా.. సేంద్రియ సాగులో త‌న‌దైన సేవ‌లు అందించాల‌ని నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలో సేంద్రియ సాగుపై అన్న‌దాత‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు.. వారిని ప్రోత్స‌హించేం దుకు కూడా చ‌ర్య‌లు తీసుకున్నారు. మ‌రీ ముఖ్యంగా యువ శాస్త్ర‌వేత్త‌ల‌ను సేంద్రియ సాగు దిశగా ప్రోత్స‌హించేందుకు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. దీనిలో భాగంగా ఆయ‌న త‌ను చైర్మ‌న్ గా ఉన్న నోవా అగ్రిగ్రూప్స్‌తో తెలంగాణ‌లోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంతో కీలక ఒప్పందాన్ని చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్ర‌కారం ఉద్యాన పంటలపై విస్తృత పరిశోధన లు, హార్టికల్చర్ విద్యార్థులకు నోవాలో శిక్షణ మరియు ఉపాధి కల్పించ‌నున్నారు.

ప్ర‌ధానంగా ఉద్యాన పంటలలో విస్తృత పరిశోధనలు చేయ‌నున్నారు. సేంద్రియ వ్యవసాయం వైపు అన్నదాతలు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తారు. పంట కోతల తర్వాత రైతులు తీసుకోవాల్సిన పద్దతులపై అవగహన కల్పిస్తారు. ఇక‌, శిక్ష‌ణ స‌మ‌యంలో ఉత్తమ అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు(ఎమ్మెస్సీ ఫ్రూట్ సైన్స్ విద్యార్థులకు) గోల్డ్ మెడల్ అందిస్తారు. ఈ సందర్భంగా చైర్మన్ ఏలూరి సాంబ‌శివ‌రావు మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తూ అన్నదాతల అభ్యున్నతే లక్ష్యంగా నోవా అగ్రి గ్రూప్ పని చేస్తోందన్నారు.

రైతన్నలకు అను నిత్యం అందుబాటులో ఉంటూ నోవా సలహాలు సూచనలు అందిస్తుందన్నారు. వ్యాపార దృక్పథంతో కాకుండా వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే లక్ష్యంతో నోవా రైతన్నలకు విస్తృత సేవలు అందిస్తున్నామన్నారు. నోవా లక్షలాది రైతన్నల మన్ననలు పొంది వారి హృదయాలలో చెరగని ముద్ర వేసిందన్నారు. అగ్రి ఉత్పాదకాల రంగంలో విశేష అనుభవం కలిగిన యంత్రాంగం నోవా సొంతమన్నారు. రైతులకు విస్తృత సేవలందించేందుకు పరిశోధనలు చేసేలా యూనివర్సిటీ తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఎమ్మెల్యే ఏలూరి వెల్లడించారు.