ఇప్పుడు సౌత్ టు నార్త్ వరకు తిరుగులేని క్రేజ్ ఉన్న హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు.
2016 సంవత్సరంలో వచ్చిన హిందీ సినిమా ఎంఎస్ ధోనీ సినిమాతో కియారాకు తిరుగులేని క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ఆమె తెలుగులో కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా వచ్చిన భరత్ అనే నేను సినిమా చేసింది. ఈ ఒక్క సినిమాతోనే ఆమె తెలుగు యూత్‌ను పూర్తిగా తన వైపునకు తిప్పేసుకుంది. ఆ తర్వాత బోయపాటి దర్శకత్వంలో రామ్‌చరణ్ పక్కన వినయ విధేయ రామ చేసింది. ఈ సినిమా డిజాస్టర్ అయినా కూడా కియారా అందచందాలకు మంచి పేరు వచ్చింది.
ఆ తర్వాత బాలీవుడ్లో వరుస హిట్లు రావడంతో కియారా టాప్ హీరోయిన్గా మారిపోయింది. తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్‌సింగ్ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాక ఆమె రేంజ్ మారిపోయి.. ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు కియారా నటిస్తున్న సినిమాల జాబితా చాలా పెదద్ది. హీరోయిన్గా మాత్రమే కాదు కమర్షియల్ యాడ్స్ రూపంలోనూ, ఇటు మోడలింగ్ ఫొటో షూట్లతో కియారా దుమ్ము రేపుతోంది.
ఇక సోషల్ మీడియాలో ఆమె హాట్ హాట్ ఫొటోలు దుమ్ము రేపేస్తూ ఉంటాయి. ఆమెకు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. కియారా అందాల ఆరబోత విషయంలో ఏమాత్రం మొహమాటం లేదు. ఆమెకు ఇన్స్టాలోనే ఏకంగా 22 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఆమెకు ఇన్‌స్టా ద్వారా కూడా లక్షల్లో ఆదాయం వస్తోంది. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసి టాప్ లెస్ వీడియోతో అయితే మతులు పోతున్నాయి.
బ్యాక్ నుండి చూస్తూ టాప్ లెస్‌గా ఉన్న ఈ ఫొటోతో ఆమె మరింత అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె రామ్‌చరణ్ – శంకర్ కాంబోలో వస్తోన్న సినిమాలో నటిస్తోంది. బాలీవుడ్లో ఈమె పలువురు స్టార్ హీరోలతో రాబోయే రెండేళ్లలో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఒప్పందం చేసుకుంది.