కోడెల కొడుకు మార‌డు.. మార‌లేడు.. పొలిటిక‌ల్ లైఫ్ ఖతం..!

కోడెల కొడుకు ఈ పేరు ఇలాగే చెప్పాలి.. త‌ప్ప‌డం లేదు.. ఇప్ప‌ట‌కీ అలాగే చెప్పుకోవాల్సిన ప‌రిస్థితి. ఏమాట‌కు ఆమాట తండ్రి దివంగ‌త మాజీ మంత్రి, విభ‌జిత ఏపీకి తొలి స్పీక‌ర్ అయిన కోడెల శివ‌ప్ర‌సాద‌రావును చాలా మంది గుంటూరు జిల్లాలో పల్నాటి పులిగా పిలుచుకుంటూ ఉంటారు. కోడెల దూకుడు ఎలా ఉన్నా.. ఆయ‌న చేసే ప‌నిలో ధీర‌త్వం, క‌మాండింగ్ ఉండేది. అందుకే ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాలు, సంక్లిష్ట‌మైన న‌ర‌సారావుపేట‌లో ఆయ‌న ఐదుసార్లు వ‌రుస‌గా గెలుస్తూ వ‌చ్చారు. 2004లో, 2009లో రెండు సార్లూ కూడా స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు. త‌ర్వాత ఆయ‌న స్వ‌గ్రామం స‌త్తెన‌ప‌ల్లిలోకి వెళ్లిపోవ‌డంతో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 2014లో అక్క‌డ పోటీ చేసి ఆరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. గుంటూరు జిల్లాలో రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా, ప‌లు శాఖ‌ల‌కు మంత్రిగా.. స్పీక‌ర్‌గా ప‌నిచేసిన అరుదైన రికార్డులు అన్నీ కోడెల‌వే.

2014లో కోడెల గెలిచాక వ‌య‌స్సు పైబ‌డ‌డ‌మో లేదా కొడుకును పొలిటిక‌ల్‌గా ప్ర‌మోట్ చేయాల‌న్న ఆశోగాని.. ఆయ‌న జీవిత చ‌ర‌మాంకాన్ని మ‌చ్చ‌ల‌తో నింపేసింది. స‌త్తెన‌ప‌ల్లిలో తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని శివ‌రాం చేయ‌ని అరాచ‌కాలు లేనేలేవు. అలాంటి వ్య‌క్తి కొడుకుగా పుట్టిన శివ‌రాం లేదా ఆయ‌న పేరు చెప్పుకున్న అనుచ‌రులు కావ‌చ్చు…. చిన్న తోపుడు బండ్ల వ్యాపారుల నుంచి బిల్డ‌ర్ల వ‌ర‌కు ఎవ్వ‌రిని వ‌ద‌ల‌కుండా దెచేశార‌నే చెపుతారు. శివ‌రాంతో పాటు కోడెల కుమార్తె అయిన విజ‌య‌ల‌క్ష్మి కూడా పోటీప‌డి మ‌రీ త‌న వాటా పాలు పంచుకుంద‌నే అంటారు.

చివ‌ర‌కు కోడెల త‌న కొడుకును కంట్రోల్ చేయ‌లేని స్థితికి వ‌చ్చేశార‌నే పార్టీ వాళ్లు చెపుతారు. అందుకే గ‌త ఎన్నిక‌ల్లో 19 వేల ఓట్ల తేడాతో చిత్తుగా ఓడారు. కోడెల ఉన్న‌ప్పుడు అంతా వెలుగు.. ఇప్పుడు శివ‌రాంను ప‌ట్టించుకునే వారేరి.. ఎందుకు ప‌ట్టించుకుంటారు. శివ‌రాం క‌రెక్టుగా ఉండి ఉంటే ఈ రోజు వాళ్ల ఫ్యామిలీకి ప‌ట్టున్న న‌ర‌సారావుపేటో లేదా స‌త్తెన‌ప‌ల్లిలోనో పిలిచి ప‌ని చేసుకోమ‌ని చెపుతారు. ఆ సాహ‌సం బాబు, లోకేష్ ఈ జ‌న్మ‌కు కూడా చేసేలా లేరు. అది శివ‌రాం స్వ‌యంకృతాప‌రాథం.

న‌ర‌సారావుపేట‌లో ఎలాగూ అర‌వింద‌బాబు బీసీ కోటాలో ఉన్నారు. ఆయ‌న్ను మార్చ‌రు.. అదే జ‌రిగితే చాలా మందే ఉన్నారు.. వాళ్ల పేర్లు కూడా బాబు మ‌దిలో ఉన్నాయి. స‌త్తెన‌ప‌ల్లికి శివ‌రాంకు ఇచ్చే ప‌రిస్థితి లేదు గాక లేదు. శివ‌రాం ఎంత గింజుకున్నా.. త‌న అనుచ‌రుల‌తో పార్టీ కేంద్ర కార్యాల‌యంలో వాళ్ల‌పై అక్రోషం వెళ్ల‌గ‌క్కుతూ పోస్టులు పెట్టించినా శివ‌రాం అక్రోషం, ఆవేద‌న ప‌ట్టించుకునే వాళ్లే లేరు. స‌త్తెన‌ప‌ల్లిలో ఆఫీస్ పెట్టి.. నాదే అస‌లైన ఆఫీస్ అని నెత్తి నోరు కొట్టుకుంటున్నా.. నియోజ‌క‌వ‌ర్గ కేడ‌ర్ మాత్రం ఆయ‌న ఆఫీస్‌కు వెళ్లం గాక వెళ్ల‌ము అంటోన్న ప‌రిస్థితే ఉంది.

గ‌త ఐదేళ్ల‌లో తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న‌ప్పుడే శివ‌రాంను చూస్తే ఆ నియోజ‌క‌వ‌ర్గ జ‌నాల‌తో పాటు టీడీపీ వాళ్లు సైతం భ‌య‌ప‌డిపోయారు. చంద్ర‌బాబు కూడా స‌త్తెన‌పల్లికి సీటుకు శివ‌రాం పేరు ప‌రిశీలించాల్సి వస్తే అంత‌కుముందే ఆయ‌న ఓ 10 మంది నేతల పేర్లు ప‌రిశీలించాలి.. వాళ్ల‌ను దాటి సీటు శివ‌రాం వ‌ర‌కు రాదే రాదు. జ‌న‌సేన‌తో పొత్తు ఉంటే క‌మ్మ భార్య ఉన్న కాపు నేత బైరా దిలీప్ చ‌క్ర‌వ‌ర్తిదే అంటున్నారు. మ‌రి చేసుకున్నోడికి చేసుకున్నంత‌గా శివ‌రాంను ఎవ‌రు కాపాడ‌తారో …! ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు క‌నుచూపు మేర‌లోనూ.. ఆకాశంలో చుక్క‌ల్లో కూడా క‌న‌ప‌డ‌ట్లేదే..!