ధర్మవరం పరిటాలకే..సూరితో ఇబ్బందేనా…?

గతానికి భిన్నంగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు…గతంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్న సరే కాస్త ఆలస్యం చేసేవారు..దాని వల్ల పెద్దగా ఉపయోగం ఉండేది కాదు…కానీ ఇప్పుడు అలా కాదు చంద్రబాబు ఏ నిర్ణయమైన చాలా వేగంగా తీసుకుంటున్నారు…అన్నీ విషయాలని క్లియర్‌గా చూసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇటీవల నియోజకవర్గాల వారీగా అభ్యర్ధులని ఫిక్స్ చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఇంకా ఎన్నికలకు రెండు ఏళ్ళు పైనే సమయం ఉంది..అయినా సరే ఇప్పటినుంచే బాబు అభ్యర్ధులని డిసైడ్ చేసేస్తున్నారు.

గతంలో అంటే ఎన్నికల ముందు అభ్యర్ధులని ప్రకటించేవారు…అలా చేయడం వల్ల పార్టీకి పెద్దగా లాభం ఉండేది కాదు…పైగా టిక్కెట్ దక్కనివారు అసంతృప్తితో పార్టీకి నష్టం జరిగేది..ఇప్పుడైతే అభ్యర్ధులని డిసైడ్ చేస్తే..అసంతృప్తిగా ఉన్నవారిని కూడా బుజ్జగించడానికి వీలు ఉంటుంది. అయితే ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో అభ్యర్ధులని ఫిక్స్ చేసిన బాబు..తాజాగా ధర్మవరం సీటుని కూడా ఖరారు చేశారు. ధర్మవరం టీడీపీ అభ్యర్ధిగా పరిటాల శ్రీరామ్‌ని ఫిక్స్ చేశారు. గత కొన్ని రోజులుగా ఈ సీటు విషయంలో రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే.

టీడీపీలోకి వచ్చి ఈ సీటు తీసుకోవాలని బీజేపీ నేత వరదాపురం సూరి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. గతంలో ఈయన టీడీపీలోనే పనిచేశారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయి…తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోయారు…ఈ మధ్య మళ్ళీ టీడీపీలోకి వచ్చి ధర్మవరం సీటు తీసుకోవాలని చూశారు. కానీ ధర్మవరం సీటు తనదే అని పరిటాల శ్రీరామ్ గట్టిగానే చెప్పేశారు..అలాగే అక్కడ పార్టీని బలోపేతం చేయడం కోసం కష్టపడుతున్నారు.

ఈ క్రమంలోనే ధర్మవరం సీటు శ్రీరామ్‌కు ఫిక్స్ చేశారు. ఇక రాప్తాడు సీటులో పరిటాల సునీతమ్మ పోటీ చేయనున్నారు. అయితే ధర్మవరంలో సూరికి కాస్త సెపరేట్ ఫాలోయింగ్ ఉంది..మరి వచ్చే ఎన్నికల్లో ఆయన వల్ల ఏమన్నా ఓట్లు చీలిపోయి శ్రీరామ్‌కు నష్టం జరుగుతుందేమో చూడాలి. ఒకవేళ జనసేనతో పొత్తు ఉంటే శ్రీరామ్‌కు ఇబ్బంది ఉండదు. మొత్తానికైతే ధర్మవరం సీటుని శ్రీరామ్ దక్కించుకున్నారు.