రష్మికతో బ్రేకప్..ఆ హాట్ బ్యూటీతో ప్యాచ్ అప్..తెర పైకి విజయ్ కొత్త గర్ల్ ఫ్రెండ్..?

సినీ ఇండస్ట్రీలో గాసిప్ లు, రూమర్లు కొత్తేమి కాదు..కలిసి ఓ సినిమా చేస్తే..ఆ సినిమా హిట్ అయినా కాకపోయినా ..ఆ మూవీలో వాళ్ల మధ్య కెమిస్ట్రీ బాగుంటే చాలు వాళ్ల మధ్య ఏదో కిచ్ కిచ్ సంబంధం ఉంది అంటూ వార్తలు పుట్టుకొస్తాయి. ఈ సాంప్రదాయం ఇప్పటిది కాదు. తరతరాలుగా వస్తూనే ఉన్నాయి. ఏ హీరో కూడా ఇలాంటీ రూమర్ల నుండి తప్పించుకోలేకపోయాడు. నటశార్వభౌముడు ఎన్టీఆర్ దగ్గర నుండి.. నిన్న మొన్న వచ్చిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ వరకు అందరు పై హాట్ రూమర్స్ వినిపించాయి. కానీ వాళ్లల్లో కొదరి హీరోల పై మాత్రం చాలా గట్టిగా గాసిప్ లు వినిపించాయి. అప్పట్లో నాగార్జున టబ్బు మధ్య ఉన్న సంబంధం..ఇప్పటికి హాట్ టాపిక్ గానే ఉంది.

ఇక ఆ తరువాత అంత క్రేజ్ తెచ్చుకున్న రూమార్ రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి చేసుకోబోతున్నారు..ఈ రూమార్ గత కొన్నాళ్లుగా మీడియాలో బాగా హైలెట్ గా మారుతుంది. ఇక దీనికి తోడు వాళ్లు కలిసి డిన్నర్లు ..న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొనడంతో అది కాస్త జనాలోకి స్ట్రాంగ్ గా వెళ్ళింది . ఇప్పుడు ఎక్కడ చూసిన..వాళ్లు ఎప్పుడు మీడియా కంట కనపడినా ఇదే విషయానికి సంబంధించిన ప్రశ్నలు ఎదురు అవుతున్నాయి . ఈ క్రమంలోనే విజయ్ స్పందిస్తూ..పరోక్షంగా రష్మిక కు నాకు మధ్య ఏం లేదు ..కేవలం ఫ్రెండ్స్ అన్నట్లు చెప్పుకొచ్చాడు. దీంతో రష్మిక విజయ్ బంధానికి బ్రేకప్ అయ్యిందంటూ మరోసారి వార్తలు వైరల్ అవుతున్నాయి.

ఇక విజయ్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం పూరీ డైరెక్షన్ లో లైగర్ అనే సినిమా చేస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగస్టు25న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఇక ఈ సినిమా విజయ్‌.. శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు అంటూ ఇప్పటికే వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. కాగా మొన్నటి వరకు ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక అని అనుకున్నారట. కానీ వాళ్ళ పై వస్తున్న రూమర్లు చూసి విజయ్..రష్మిక ప్లేస్ లోకి బాలీవుడ్‌ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇక దీని పై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రాబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. దీంతో విజయ్ కొత్త గర్ల్ ఫ్రెండ్ కియారా అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.