మొగుడిని వదిలేసిన ఆడది ..సమంత మైండ్ బ్లాకింగ్ రీప్లై..!

టాలీవుడ్ లోకి ఏమాయ చేసావే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సమంత అతి తక్కువ టైంలో తన పేరు అందరికి తెలిసేలా చేసుకుంది. మంచి మంచి స్టోరీ లైన్ ఉన్న కంటెంట్ ని చూస్ చేసుకుంటూ..మిగతా హీరోయిన్లకి గట్టి పోటీ ఇస్తూ..బడా బడా స్టార్స్ సినిమాలో నటించే అవకాశం అందుకుంది. ఇక అలా అందుకున్న ప్రతి అవకాసాని ఉపయోగించుకుంటూ..తనలోని టాలెంట్ ను జనాలకు చూయిస్తూ..అతి తక్కువ టైంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేరిపోయింది.

ఒకానొక టైంలో సమంత ఫుల్ కాల్ షీట్లతో బిజీ అయిపోయి తినడానికి కూడా టైం లేకుండా ఉండే పరిస్ధితి ఏర్పడింది అంటేనే అప్పట్లో ఆమె హవా ఎలా నడిచిందో అర్ధం చేసుకోవచ్చు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే నాగచైతన్య ను ప్రేమించి పెళ్లిచేసుకుంది. దీంతో అమ్మడు డబుల్ స్టార్ స్టేటస్ అందుకుంది. హమ్మయ్య..ఇక అంతా బాగానే ఉంది అని అనుకుంటున్న టైంలో సడెన్ గా మేం విడాకులు తీసుకుని వేరు వేరుగా ఉండాలి అని అనుకుంటున్నాం అంటూ చైతన్య సమంత తమ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలల్లో పోస్ట్ చేసుకోచ్చారు. దీంతో అక్కినేని అభిమానుల గుండె ఆగినంత పని అయ్యింది. ఇక అప్పటి నుండి వాళ్ళ పై మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

మరీ ముఖ్యంగా విడాకుల తరువాత సమంతపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎక్కువైంది. బూతు పదాలు మాట్లాడుతూ ఆమెను దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఓ నెటిజెన్ ఆమె పై బ్యాడ్ కామెంట్స్ చేశాడు. సమంత తన ఇన్ స్టా అకౌంట్ పేజీలో ఆస్క్ మీ ఎనీథింగ్ అనే సెషన్ నిర్వహించింది. ఇక అందులో ఓ నెటిజన్..ఐ వాన రీ ప్రొడ్యూస్ యూ అంటూ షాకింగ్ కామెంట్ చేశాడు. ఈ తలతిక్క ప్రశ్నకు సమంత ఘాటైన ఆన్సర్ ఇస్తూ స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. అసలు ఫస్ట్ రీ ప్రొడ్యూస్ ను ఒక వ్యాక్యంలో ఎలా ఉపయోగిస్తారు ? దానిని ముందుగా గూగుల్ చేసి చూడాలా ? అంటూ కౌంటరిచ్చింది. దీంతో సమంత మంచి ఆన్సర్ ఇచ్చింది అంటూ ఆమెను మెచ్చుకుంటున్నారు సామ్ అభిమానులు. ఇక కొందరు ఆడవాళ్ళు అయితే ఓ ఆడాది భర్తకు విడాకులు ఇస్తే మీరు ఆ దృష్టి తోనే చూస్తారా..? అంటూ మండిపడుతున్నారు. ఏది ఏమైనా విడాకుల తరువాత సమంత మీద బ్యాడ్ కామెంట్స్ ఎక్కువైపోతున్నాయి.