జగన్ ప్రత్యర్ధిని ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు… గెలుపు సీన్ లేదు.. మెజార్టీ అయినా త‌గ్గుతుందా..!

ఎట్టకేలకు పులివెందుల నియోజకవర్గంలో జగన్‌పై పోటీ చేసే టీడీపీ నేత ఫిక్స్ అయ్యారు..వచ్చే ఎన్నికల్లో జగన్‌పై బీటెక్ రవి పోటీ చేయనున్నారు…తాజాగా చంద్రబాబు..పులివెందుల అభ్యర్ధిగా బీటెక్ రవిని ఫిక్స్ చేశారు…అయితే బీటెక్ రవి..పులివెందులలో జగన్ మెజారిటీని తగ్గించగలరా ? అసలు ఎంతవరకు జగన్‌కు పోటీ ఇవ్వగలరు అనే విషయాలని ఒకసారి చూస్తే పులివెందుల అంటే వైఎస్సార్ ఫ్యామిలీ అడ్డా అనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక్కడ ఆ ఫ్యామిలీ తప్ప..మరొకరు గెలవడానికి లేదు…ఇంతవరకు గెలవలేదు కూడా.

అయితే గత కొన్నేళ్లుగా వైఎస్సార్ ఫ్యామిలీ ప్రత్యర్ధిగా సతీశ్ రెడ్డి పోటీ చేస్తూ వస్తున్నారు…2004 నుంచి ఆయనే టీడీపీ తరుపున బరిలో దిగడం, ఓడిపోవడం జరుగుతూ వస్తుంది. అందుకే సతీశ్‌కు టీడీపీలో కీలక పదవులు కూడా దక్కుతున్నాయి. 2014లో జగన్‌పై పోటీ చేసి ఓడిపోయాక సతీశ్‌కు ఎమ్మెల్సీ పదవి కూడా దక్కింది. ఇక 2019 ఎన్నికల్లో కూడా జగన్‌పై సతీశ్ రెడ్డి పోటీ చేశారు కానీ ఈ సారి ఎప్పుడూలేని విధంగా 90 వేల ఓట్ల భారీ మెజారిటీతో సతీశ్ ఓడిపోయారు. పైగా ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చింది.

దీంతో సతీశ్ ఏకంగా రాజకీయాలకే దూరం జరిగారు…టీడీపీకి రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు. సతీశ్ వెళ్లిపోయాక పులివెందుల బాధ్యతలు ఎమ్మెల్సీ బీటెక్ రవి చూసుకుంటున్నారు..ఆయనే అక్కడ టీడీపీని నడిపిస్తున్నారు. అయితే తాజాగా బీటెక్ రవినే పులివెందుల టీడీపీ అభ్యర్ధిగా ఫిక్స్ చేశారు. సతీశ్ రెడ్డి మళ్ళీ టీడీపీలోకి వస్తారని ప్రచారం జరిగినా సరే బాబు..బీటెక్ రవికే సీటు ఫిక్స్ చేశారు.

అయితే రాష్ట్రంలో వైసీపీకి వ్యతిరేకంగా పరిస్తితులు మారుతున్నాయి…ఇటు కడప జిల్లాలో కూడా వైసీపీకి యాంటీగానే ఉంది..పైగా వైఎస్ వివేకా హత్య కేసు జగన్‌కు బాగా నెగిటివ్ అయ్యేలా ఉంది..ఈ క్రమంలో బీటెక్ రవి ఇంకా దూకుడుగా పనిచేస్తే..ఖచ్చితంగా పులివెందులలో జగన్ మెజారిటీ తగ్గించే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ సారి పులివెందులలో ఎలాంటి ఫలితం ఉంటుందో..?