ఆ ఒక్క మాటతో పరువు మొత్తం పాయే..దేత్తడిపై దిమ్మతిరిగే ట్రోలింగ్..!!

తమలోని టాలెంట్ ను నలుగురికి చూయించడానికి సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ ఫాం లా మారింది. టాలెంట్ ఉండాలే కానీ…జనాలు సామాన్యులను కూడా సెలబ్రిటీలు చేయగలరు అని మరోసారి ప్రూవ్ చేసింది ఈ సోషల్ మీడియా. చిన్న చిన్న కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్..చేసుకుంటూ పాపులర్ అయ్యి ఇప్పుడు స్టార్ హీరో,హీరోయిన్ల కంటే ఎక్కువ పాపులర్ అయిన సోషల్ మీడియా స్టార్ చాలా మందే ఉన్నారు. వాళ్లల్లో ప్రధానంగా షణ్ముఖ్ జశ్వంత్, దేత్తడి హారిక పేరు వినిపిస్తాయి.

ఒకప్పుడు నార్మల్ పీపుల్స్ లా ఉండే వీరికి ఇప్పుడు జనాల్లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మనం ఒక పోజీషన్ కి వెళ్లిన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నా..సోషల్ మీదియా ద్వార ఒక విషయాని చెప్పాలి అని అనుకున్నా కానీ చాలా జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు చూసుకోవాలి..లేదంటే నెటిజన్స్ చెడుగుడు ఆడేసుకుంటారు. ఇప్పటికే అలా చాలా మంది సెలాబ్రిటీలు పొరబాటున తప్పుగా మాట్లాడి నెట్టింట ట్రోల్స్ కి గురైన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అలా లిస్ట్ లోకి దేత్తడి హారిక చేరింది.

బిగ్‌బాస్‌ బ్యూటీ, యూట్యూబ్‌ స్టార్‌ దేత్తడి హారిక అలియాస్‌ అలేఖ్య హారిక ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వీపరితమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటోంది. దానికి కారణం ఆమె పెట్టిన వీడియో. రీసెంట్ గా తనలోని నటన ప్రతిభను చూపిస్తూ.. వింత వింత ఎక్స్‌ప్రెషన్స్‌తో క్యూట్ క్యూట్ స్మైల్ ఇస్తూ..ఓ వీడియోను తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో షేర్‌ చేస్తూ అభిమానులతో పంచుకుంది. ఇంత వరకు బాగానే ఉంది. కానీ ఆ వీడియోకి పెట్టిన క్యాప్షన్ నే కొంప ముంచింది. ఆ వీడియోకి ఎక్స్‌ప్రెషన్‌ క్వీన్‌ (Expresstion Queen) అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. అయితే ఇక్కడే హారిక పాప అడ్డంగా దొరికిపోయింది. Expression బదులుగా Expresstion అని మిస్టేక్‌ టైప్ చేసింది. అది పాప చూసుకోకుండానే పోస్ట్ చేసింది. మనోలు చూసుకున్నారు. ఇప్పుడు పాపని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఉన్నంత కాలం ఇంగ్లీష్‌ మాట్లాడుతూ బిల్డప్‌ ఇచ్చావు.. ఇదా నీ టాలెంట్ అంటూ.. కనీసం స్పెల్లింగ్ అయినా సరిగా రాయడం నేర్చుకోమ్మా తల్లి..అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.