క్రేజీ అప్డేట్: సుక్కుతో మెగాస్టార్..అఫిషియల్ ప్రకటన వచ్చేసిందోచ్..!!

సినీ ఇండస్ట్రీలో ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సరే మెగాస్టార్ లాంటి వాళ్లను డైరెక్ట్ చేయాలని అనుకుంటారు. అందులో తప్పు లేదు. అలాంటి క్రేజ్ ఉంది చిరంజీవికి. బడా బడా దర్శకులు కూడా ఆయనతో కలిసి వర్క్ చేయాలి అని అనుకుంటుంటారు. అలాంటి అవకాశం వస్తే ఏ డైరెక్టర్ అయినా ఎగిరి గంతేస్తాడు . ప్రస్తుతానికి లెక్కల మాస్టార్ సుకుమార్ కూడా ఆ పనే చేస్తున్నట్లు తెలుస్తుంది. ఎప్పటి నుండొ వేచి చూస్తున్న ఆయనకు అవకాశం రానే వచ్చింది. మెగాస్టార్ చిరంజీవితో కలిసి వర్క్ చేయబోతున్నాడు సుకుమార్. ఈ విషయాని ఆయనే స్వయంగా చెప్పుకొచ్చాడు.

రీసెంట్ గా బన్నీ తో పుష్ప – ది రైజ్ అంటూ భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ఈయన..ఈ సినిమా ద్వార పక్క భాషల ఇండస్ట్రీలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను తెరకెక్కించిన సుక్కు రేంజ్ ఈ సినిమా తరువాత ఎక్కడి కో వెళ్లిపోయింది. ప్రస్తుతం పుష్ప ది రూల్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సిద్ధమౌతున్న సుకుమార్ కి ఇంతలో ఓ భారీ ఆఫర్ వచ్చింది. తన కల నిజం అయ్యే బంపర్ ఆఫర్ ని అందుకున్నాడు ఈ క్రేజీ డైరెక్టర్.

ఇప్పటికే వరుస సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా ఉన్న చిరంజీవి..సుకుమార్ డైరెక్షన్ లో నటించడానికి పచ్చ జెండా ఊపిన్నట్లు తెలుస్తుంది. అయితే అది సినిమా కాదు..ఓ కమర్షియల్‌ యాడ్‌ అన్నట్లు తెలుస్తుంది. చిరంజీవి నటిస్తున్న ఆ యాడ్‌ను సుకుమార్ డైరెక్ట్ చేయనున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. సుకుమార్ తాగాజా తన ఇన్స్టా ఖాతాలో చిరంజీవి తో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ..ఇన్నాళ్లకు నా కల నిజమైంది. పూర్తి డీటైల్స్ త్వరలోనే అంటూ పోస్ట్ చేశాడు. అలా సుకుమార్ డైరెక్షన్ లో చిరంజీవి నటించనున్నట్టు అధికారికంగా ప్రకటించాడు . దీంతో చిరంజీవితో దిగిన సుక్కు ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపొతే మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు.