అందరూ చూస్తుండగా అగ్నికి ఆహుతైన చిరంజీవి పర్మినెంట్ కెమెరామెన్

సినిమా బాగా రావాలి అంటే కెమెరా మెన్ చక్కగా పని చేయాలి. కథ పండేందుకు తన ప్రతిభ చాలా ముఖ్యం. దర్శకుడి ఆలోచనకు అనుగునంగా అద్భుతంగా తెర మీద చూపిండమే కెమెరా మెన్ బాధ్యత.అలాంటి అద్భుత కెమెరా మెన్ లోక్ సింగ్. చక్కటి ప్రతిభతో పాటు మంచి అంకితభావం ఉన్న వ్యక్తి. వాస్తవానికి ఇతడి పేరు విని నార్త్ ఇండియన్ అనుకుంటారు. కానీ తను పుట్టి పెరిగింది చెన్నైలో. ఈయన ప్రముఖ దర్శకుడు భీమ్ సింగ్ అన్న కొడుకు. డైరక్టర్ భీం సింగ్ మూలంగా లోక్ సింగ్ కు చిన్నతనంలోనే సినిమా అంటే ఇష్టం ఏర్పడింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తో కలిసి చెన్నై కేసరి స్కూల్లో చదువుకున్నాడు.

సినిమా రంగంలో కెమెరి అనేది కీలకం అనుకున్నాడు. తన జీవితాన్ని ఆ దిశగా ముందుకు తీసుకెళ్లాలి అనుకున్నాడు. అనుకున్నట్లుగానే ప్రముఖ కెమెరామెన్ కెఎస్ ప్రసాద్ దగ్గర పనిలో చేరాడు. కెవి రెడ్డి సొంత సినిమా పెళ్లి ప్రమాణాలు సహా పలు సినిమాలకు ప్రసాద్ కెమెరామెన్. ఆయన దగ్గర పనిచేస్తూ నెమ్మదిగా ఇషాన్ ఆర్య టీమ్ లో చేరిపోయాడు లోక్ సింగ్. ఇషాన్ దగ్గర పని చేసి బాబా అజ్మీ దగ్గర అపరేటివ్ కెమెరామెన్ గా, స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం చేరాడు. ఆ సినిమాలో తన పనితీరుతో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత బాపుగారి త్యాగయ్యలోనూ స్పెషల్ ఎఫెక్ట్స్ అన్నీ ఆయనే చేశాడు.

అల్లు అరవింద్ తో ఉన్న స్నేహంతో విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన శుభలేఖ సినిమాకు పూర్తిస్థాయి కెమెరామెన్ గా మారాడు లోక్ సింగ్. చిరంజీవిని అంతకు ముందు ఎవరూ చూపించని రీతిలో అందంగా చూపించాడు. తన ఖాళీ సమయంలో ఎక్కవగా అల్లు అరవింద్ ఆఫీస్ లోనే గడిపేవాడు. అల్లు అరవింద్ ద్వారా చిరంజీవికి పరిచయం అయ్యాడు. శుభలేఖ తర్వాత చిరంజీవితో హాలీవుడ్ స్థాయి యాక్షన్ మూవీ చేశాడు అరవింద్. రాజ్ భరత్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా యవకింకరుడు. సినిమాటోగ్రాఫర్ గా మంచి పేరు సంపాదించుకుంది కూడా ఈ సినిమాతోనే. ఆ తర్వాత బాపు దర్శకత్వంలో చిరంజీవి సినిమా మంత్రిగారి వియ్యంకుడు అనుకున్నారు. ఈ సినిమాలోని ఫైట్స్ ను డ్యాన్సులను అద్భుతంగా చిత్రీకరించాడు లోక్ సింగ్. ఆ తర్వాత చిరంజీవి చేసిన చాలా సినిమాలకు తనే కెమెరామెన్ గా చేశాడు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తన కొడుకు భరత్ ను హీరోగా పెట్టి వార్నింగ్ అనే సినిమా తీశాడు. దానికి లోక్ సింగ్ కెమెరామెన్. పాట చిత్రీకరణలో హీరోయిన్ ఆమని మంటల మధ్య డ్యాన్స్ చేయాలి. ఆ మంటల కోసం ఓ కుర్రాడు పెట్రోల్ పోస్తున్నాడు. కానీ తను అనుకున్నట్లుగా మంటలు రావడంలేదని తనే వెళ్లి పెట్రోల్ పోశాడు. అదే సమయంలో ఆ మంటలు తనకు అంటుకున్నాయి. అందరూ చూస్తుండగానే కెమెరామెన్ లోక్ సింగ్ మంటలకు ఆహుతయ్యాడు. చిరంజీవి పర్మినెంట్ సినిమాటోగ్రాఫ్ అర్థాంతరంగా కన్నుమూశాడు.