జబర్దస్త్ కమెడియన్ పవిత్ర గురించి విషయాలు మీకు తెలుసా?

ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులందరూ కాసేపు హాయిగా నవ్వుకోవాలంటే అందరికీ మొదటి ఆప్షన్ జబర్దస్త్. హాయిగా యూట్యూబ్ లో జబర్దస్త్ చూసుకొని కాసేపు ఉపశమనం పొందుతూ ఉంటా.రు అంతలా తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోయింది ఈ కామెడీ షో. ఎన్నో ఏళ్ల నుంచి ఎంతో సక్సెస్ఫుల్గా కొనసాగుతూ బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇక ఇటీవల కాలంలో జబర్దస్త్ లో కి ఎంతో మంది కొత్త కమెడియన్స్ కూడా వస్తూ బాగా ఫేమస్ అవుతున్నారు అన్న విషయం తెలిసిందే. అయితే ఒకప్పుడు జబర్దస్త్ లో యాంకర్ జడ్జి తప్ప ఆడవాళ్లు ఎక్కడ కనిపించేవారు కాదు. కానీ ఇటీవల కాలంలో జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ కూడా ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు.

ఒకప్పుడు లేడీ గెటప్స్ చూసి విసుగు చెందిన తెలుగు ప్రేక్షకులు కూడా లేడీ కమెడియన్స్ ని బాగా ఆదరిస్తూ ఉండటం గమనార్హం. గత కొన్ని నెలల నుంచి ఎంతోమంది అమ్మాయిలు జబర్దస్త్ లో అబ్బాయిలకు పోటీ ఇస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో జబర్దస్త్ ద్వారా బాగా ఫేమస్ అయిన లేడీ కమెడియన్ పవిత్ర. ఈమె నాలుగడుగులు ఉంటుంది కానీ వేసే పంచ్ లు మాత్రం ఆరడుగులు ఉంటాయి. ప్రస్తుతం జబర్దస్త్ లో ఎన్నో టీం లలో స్కిట్లు చేస్తూ ఎంతో మందిని ఆకర్షిస్తుంది. అదిరిపోయే కామెడీ టైమింగ్తో కడుపుబ్బ నవ్విస్తుంది. కాగా ఈమెకు బాగా పాపులారిటీ రావడంతో అసలు ఎవరు పవిత్ర అని వెతకడం ప్రారంభించారు అందరు.

అయితే ప్రస్తుతం జబర్దస్త్ లో సత్తా చాటుతున్న లేడీ కమెడియన్ పవిత్ర టిక్ టాక్ నుంచి వచ్చింది అని తెలుస్తోంది. ఇక టిక్ టాక్ లో వీడియోలు చూసి మెల్లగా జబర్దస్త్ టీం లీడర్ పిలవడం.. ఇక ఆ తర్వాత తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోవడం జబర్దస్త్ ఫిక్స్ అయి పోవడం జరిగింది. అయితే అంతకు ముందు కొన్ని టీవీ సీరియల్ లో కూడా నటించిందట పవిత్ర. కానీ సీరియల్ తో మాత్రం అంతగా గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. కానీ ఇప్పుడు మాత్రం తన కామెడీ టైమింగ్ తో జబర్దస్త్ లో పాతుకుపోయింది అని చెప్పాలి.