అన్ స్టాపబుల్ షో వెనుక బాలయ్య చిన్నకూతరు..

నందమూరి నట సింహం బాలయ్య. వెండి తెరపై దుమ్మురేపిన ఈ ఎన్టీఆర్ తనయుడు.. ఇప్పుడు బుల్లితెర మీద సైతం సందడి చేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన అఖండ సినిమాతో థియేటర్లతో పాటు డిజిటల్ లోనూ సత్తా చాటాడు. అంతేకాదు.. ఓటీటీ వేదిక మీద కూడా దూసుకెళ్తున్నాడు. ఆహా ఓటీటీ బాలయ్యలోని మరో కోణాన్ని బయటకు తీసింది. బాప్ ఆఫ్ ఆల్ టాక్ షోస్ అనేలా బాలయ్యతో ఓ షోను రూపొందించింది. టైటిల్ కు తగినట్లుగానే ఆయన ఎనర్జీకి సరిపోయేలా అన్ స్టాపబుల్ షోతో అదుర్స్ అనిపిస్తున్నాడు బాలయ్య. తొలి సీజన్ తో ఇండియాలోనే టాప్ షోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తన షోతో హోస్టుగా మంచి మార్కులు కొట్టేశాడు.

 తొలి సీజన్ ఓ రేంజిలో సూపర్ సక్సెస్ కావడంతో త్వరలో రెండో సీజన్ మొదలు కానుంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ సీజన్ కూడా మరో రేంజిలో సెట్ చేస్తుంది ఆహా టీం. వాస్తవానికి ఈ షో ఇంత అద్భుతంగా సక్సెస్ కావడానికి కారణం ఎవరు అనే చర్చనడుస్తొంది. అంతేకాదు.. తనలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ బయటకు రావడానికి కారణం ఏంటి? అని అందరూ ప్రశ్నించుకుంటున్నారు. అయితే ఇందుకు కారణం ఓ వ్యక్తి అని తేలింది. ఇంతకీ తను ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

 అన్ స్టాపబుల్ షోకు రచయిత, దర్శకుడు బీవీఎస్ రవి రైటర్ గా చేస్తున్నాడు. తాజాగా పలు ఇంటర్వ్యూలలో మాట్లాడని రవి.. ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. బాలయ్య అన్ స్టాపబుల్ షో కోసం బాలయ్య చిన్న కూతురు తేజస్విని కూడా పని చేసినట్లు చెప్పాడు. బాలయ్యను ఈ షోలో కొత్తగా చూపించేందుకు తను చాలా ప్రయత్నించిందని చెప్పాడు.  అన్‌స్టాపబుల్  టీమ్‌తో పని చేస్తూ బాలయ్య లుక్, కాస్ట్యూమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు వెల్లడించాడు. తర్వాత సీజన్లలో కూడా తేజస్వి పని చేయబోతున్నట్లు వెల్లడించాడు. మొత్తంగా బాలయ్యలోని సెన్స్ ఆఫ్ హ్యూమర్ ను బయటకు వచ్చేలా చేసేది ఆయన చిన్నకూతురన్నమాట.