దాని కోసం చాలా వెయిట్ చేశానంటున్న తెలుగమ్మాయి..

డింపుల్ హయాతి. ఈ పేరు వినగానే ఎక్కడి నుంచో తెలుగు సినిమా పరిశ్రమలోకి దిగుమతి అయిన బ్యూటీ అని అందరూ అనుకుంటారు. కానీ తను అచ్చ తెలుగు అమ్మాయి. గద్దలకొండ గణేష్ అనే సినిమాలో కనిపించింది. తొలి సినిమాలో స్పెషల్ సాంగ్ తో సినీ అభిమానులను బాగా అలరించింది. ఈమె మంచి అవకాశాలను అందుకుంటుంది అని చాలా మంది అన్నారు. తాజాగా ఈ ముద్దుగుమ్మ రవితేజతో కలిసి ఖిలాడి సినిమాలో సందడి చేయబోతుంది. గోపించంద్ హీరోగా తెరకెక్కబోతున్న మరో సినిమాలోనే ఈ అమ్మడు అవకాశాన్ని అందుకుంది. తాజాగా ఖిలాడి విడుదల నేపథ్యంలో ఈ ముద్దుగుమ్మ పలు విషయాలను వెల్లడించింది.

గద్దలకొండ గణేష్ తర్వాత మంచి అవకాశం కోసం ఎదురు చూసినట్లు చెప్పింది. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడంతో ఆ తర్వాత అలాంటి అవకాశాలే వచ్చాయని చెప్పింది. అయితే హీరోయిన్ గా అవకాశం పొందేందుకు వాటిని వదులుకున్నట్లు చెప్పింది. అందుకోసం ఖిలాడి కోసం వెయిట్ చేయాల్సి వచ్చిందని చెప్పింది. ఈ సినిమాలో తను గ్లామరస్ గా కనిపించే ట్రెండీ అమ్మాయిలా కనిపిస్తానని చెప్పింది. ఇంత కాలం తను ఎలాంటి పాత్ర కోసం అయితే వెయిట్ చేశానో.. అలాంటి క్యారెక్టరే లభించిందని వెల్లడించింది. జనాల తీర్పు కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించింది. అటు విశాల్ తో కలిసి సామాన్యుడు సినిమాలో హీరోయిన్ గా చేసినట్లు చెప్పింది. ఈ రెండు సినిమాలు ఒకేసారి విడుదల కాబోతున్నట్లు చెప్పింది. అటు హిందీలో అత్రంగీ రే అనే సినిమాలో చిన్న క్యారెక్టర్ చేసినా మంచి గుర్తింపు వచ్చినట్లు వెల్లడించింది.

వాస్తవానికి తాను కొంచెం నలుపు రంగులో ఉన్న అమ్మాయినని చెప్పింది. అయితే ఇండస్ట్రీలో తెల్లరంగుతో పాటు అందంగా ఉన్నవారికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని చెప్పింది. అయితే ప్రస్తుతం ప్రతిభకు తగిన ప్రాధాన్యత దక్కుతుంది వెల్లడించింది. నలుపు రంగు కారణంగా చాలా సార్లు తిరస్కరణకు గురైనట్లు చెప్పింది. అప్పుడు చాలా నిరాశ కలిగినట్లు వెల్లడించింది. అటు తన కుటుంబంలో చాలా మంది నటులు, డ్యాన్సర్లు ఉన్నట్లు చెప్పింది. విజయవాడలో పుట్టి హైదరాబాద్ లో పెరిగినట్లు వెల్లడించింది. 16 ఏండ్లకే గల్ఫ్ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చినట్లు చెప్పింది.