ఆర్ఆర్ఆర్ పై దిల్ రాజు సంచలన వ్యాఖ్యాలు..

రాజమౌళి తెరకెక్కించిన భారీ సినిమాలతో భారతీయ సినిమా పరిశ్రమ రూపు రేఖలు మారిపోయాయి. బాహుబలి లాంటి సినిమాతో హాలీవుడ్ రేంజి సినిమాను రూపొందించి ప్రపంచ సినీ పరిశ్రమకే సవాల్ విసిరాడు. హాలీవుడ్ లో వేల కోట్లు పెట్టి తీసే సినిమాలను జక్కన్న కేవలం వందల కోట్లతోనే తీస్తూ అబ్బుర పరుస్తున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదలై వేల కోట్ల రూపాయల వసూళ్లు సాధిస్తున్నాయి. మొత్తానికి రాజమౌళి కారణంగా తెలుగు సినిమా పరిశ్రమకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి గౌరవం దక్కింది. బాలీవుడ్ మొదలుకొని సౌత్ లోని మిగతా సినిమా పరిశ్రమలకు కూడా టాలీవుడ్ హిట్ సినిమాలను ఆయా భాషల్లోకి రీమేక్ చేసుకునే పరిస్థితి నెలకొంది.

తాజాగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్నా.. పలు రకాల కారణాలతో ఈ సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి రెండు డేట్లను ప్రకటించారు. ఈ రెండింటిలో ఏదో ఒక రోజు ఈ సినిమా విడుదల కానుంది. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా మీద ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న ఈ సినిమా జనాల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా వస్తున్న నేపథ్యంలో పవన్ కల్యాణ్ భీమ్లా నాయక్, మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలు వాదా పడ్డాయి.

ఈ సినిమా విడుదలను పదే పదే వాయిదా వేయడం పట్ల పలువురు నిర్మాతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా రాజమౌళి దర్శకత్వంలో వస్తుంది కాబట్టి.. మరే సినిమాకు కూడా నష్టం రాకుండా ఉండాలి. అందుకే కచ్చితంగా మిగతా సినిమాలు వాయిదా వేసుకోవాల్సిందే. ఈ సమయంలో తన సినిమా ఎఫ్3 కూడా వాయిదా పడేఅవకాశం ఉందని దిల్ రాజు చెప్పాడు. తెలుగు సినిమా పరిశ్రమలో పెద్ద సినిమాలను నిర్మించే దిల్ రాజు ఈ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.