ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ర‌వితేజ మ‌ద్దెల ద‌రువేంటో..?

ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ర‌వితేజ మ‌ద్దెల ద‌రువు.. ఇప్పుడు ఈ మాటే ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. క్రాక్ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని మంచి కంబ్యాక్ ఇచ్చిన మాస్ మ‌హారాజా ర‌వితేజ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే.

Ravi Teja lip-lock with Meenakshi Chaudhary in Khiladi

ఇప్ప‌టికే రమేష్ వర్మ దర్శకత్వంతో `ఖిలాడి` చిత్రాన్ని పూర్తి చేశాడు ర‌వితేజ‌. మీనాక్షి చౌదరీ, డింపుల్ హయతి హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రం విడుద‌లకు సిద్ధంగా ఉండ‌గా.. శరత్ మండవ దర్శకత్వంలో ర‌వితేజ `రామారావు ఆన్ డ్యూటీ` అనే మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ మూవీలో దివ్యాన్ష కౌశిక్, రజీష విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Rama Rao On Duty Movie Heroines | Ravi Teja | RamaRao Movie | Rajisha Vijayan | Divyansha Kaushik - YouTube

అలాగే మ‌రోవైపు డైరెక్టర్ నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో `ధమాకా` సినిమాను షురూ చేసేశాడు మ‌న మాస్ మ‌హారాజ‌. అయితే ఆస‌క్తిక‌ర విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలోనూ ఇద్ద‌రు హీరోయిన్లు ఉండ‌నున్నార‌ట‌. అందులో `పెళ్లి సంద‌D` ఫేమ్ శ్రీ‌లీలా ఒక‌రు కాగా.. మ‌రొక హీరోయిన్ కోసం ద‌ర్శ‌కుడు వేట‌లో ఉన్నాడ‌ని తెలుస్తోంది.

Ravi Teja shares his first look poster of Dhamaka as he extends Dussehra wishes

క‌థ డిమాండ్ మేర‌కు తీసుకుంటున్నారా..? లేక‌ క‌లిసొస్తుంద‌ని తీసుకుంటున్నారా..? అన్న‌ది ప‌క్క‌న పెడితే.. ఈ మధ్య రావితేజ చేస్తున్న అన్ని ప్రాజెక్స్‌లోనూ ఇద్దరు హీరోయిన్లు ఉండ‌టం కామ‌న్ అయిపోయింది. దీంతో ఇప్పుడీ విష‌యమే నెట్టింట హాట్ టాపిక్‌గా కూడా మారింది. కాగా, ధ‌మాకా త‌ర్వాత ర‌తివేజ రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాల‌ను చేయ‌నున్నాడు.